విమానం టేకాఫ్‌ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు | USA Denver Airport Smoke On AA-3023 Flight Runway Before Takeoff | Sakshi
Sakshi News home page

విమానం టేకాఫ్‌ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు

Jul 27 2025 9:19 AM | Updated on Jul 27 2025 11:06 AM

USA Denver Airport Smoke On AA-3023 Flight Runway Before Takeoff

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్‌ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్‌స్టాఫ్‌ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్‌ విమానాశ్రయం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్‌ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్‌ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement