వీడియో: అమెరికాలో విమాన ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు | American Airlines Catches fire Denver International Airport | Sakshi
Sakshi News home page

వీడియో: అమెరికాలో విమాన ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు

Mar 14 2025 8:46 AM | Updated on Mar 14 2025 10:37 AM

American Airlines Catches fire Denver International Airport

వాష్టింగన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.  తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం మంటల్లో దగ్ధమైంది. విమానం నుంచి ప్రయాణీకులు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారాయి.

వివరాల ప్రకారం. అమెరికాలోని డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Denver International Airport)లో శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం-1006.. మంటల్లో దగ్ధమైంది. విమానాశ్రయమంలో ల్యాండ్‌ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో, ప్రయాణీకులు విమానం నుంచి హుటాహుటినా బయటకు వచ్చి.. ప్రాణాలు రక్షించుకున్నారు. దట్టమైన పొగలో నుంచి ప్రయాణీకులు వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అయితే, ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 172 మంది ప్రయాణీకులు, ఆరుగురు విమాన సిబ్బంది ప్రయాణం చేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement