breaking news
take off
-
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
ముంబై: అది ఇండిగో విమానం.. ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న రభస అంతా ఇంతా కాదు. సీట్లలో కూర్చొన్న ప్రయాణికలు ఒక్కొక్కరిగా తమ నిరసనను ఉధృతం చేశారు. తొలుత కొంత ఓపిక పట్టిన ప్రయాణికులు.. ఆపై తమ సహనం కోల్పోయారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలంటూ విమాన సిబ్బందిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే విమానం లోపల ఉన్న ఎయిర్ హోస్టస్ వద్ద కచ్చితమైన సమాధానం లేకపోవడంతో ప్రయాణికుల్ని బ్రతిమాలుకున్నారు. ప్లీజ్.. మీకు చేతులెత్తి దండం పెడతా.. దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి’ అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ ఓ ప్రయాణికుడ్ని బ్రతిమాలుతున్న వీడియో వైరల్‌గా మారింది. విమానంలోని ఈ రగడ జరిగే సమయంలో ఎవరో వీడియో తీసి పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. ఇదంతా శనివారం(జూలై 26) రాత్రి ముంబై నుంచి వారణాసి బయల్దేరే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గం. 9. 45 ని.లకు బయల్దేరాల్సిన విమానం.. టేకాఫ్ కావడానికి సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. ఆ విమానం రాత్రి గం. 11.40 ని.లకు టేకాఫ్ అయ్యింది. -
విమానం టేకాఫ్ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025 -
భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువ
దేశీయంగా చాలా మటుకు విమానయాన సంస్థలు భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా వెచ్చి స్తున్నాయని అత్యధిక శాతం విమాన ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ విషయంపై లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 76 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా టేకాఫ్ సమయంలోనో, ల్యాండింగ్లోనో లేదా విమానంలోనో ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నట్లు 64 శాతం మంది తెలిపారు. దేశవ్యాప్తంగా 322 జిల్లాల నుంచి 44,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.‘భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎయిర్‌లైన్స్, భద్రత కన్నా పబ్లిసిటీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయని భావిస్తున్నారా’ అనే ప్రశ్నకు స్పందించిన 26,696 మంది ప్రయాణికుల్లో 43% మంది ‘అవును. అన్ని సంస్థలు అలాగే ఉన్నాయి’ అని, 33% మంది ‘అవును. కొన్ని సంస్థలే అలా ఉన్నాయి’ అని, 11% మంది ‘ఏ కంపెనీ కూడా అలా లేదు’ అని చెప్పారు. 13 శాతం మంది మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.సూ్థలంగా చెప్పాలంటే చాలా మటుకు ఎయిర్‌లైన్స్ భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నట్లు వెల్లడైందని లోకల్‌సర్కిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63% మంది పురుషులు కాగా, 37% మంది మహిళలు. వీరిలో 46% మంది ప్రథమ శ్రేణి నగరాలకు చెందినవారు. 25% మంది ద్వితీయ శ్రేణి నగరాలకు, మిగతా 29% మంది తృతీయ, చతుర్థ శ్రేణి.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. పెరుగుతున్న ఉదంతాలు..ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గత నెల టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో, 241 మంది ప్రయాణికులు, ఇతరత్రా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రాష్‌పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ జరిపి, ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది.మరోవైపు, సోమవారం నాడు కొచ్చి–ముంబై ఎయిరిండియా ఫ్లయిట్, ల్యాండింగ్ సమయంలో రన్‌వే మీద నుంచి పక్కకు జారిపోయిన ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే రోజున సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ–కోల్‌కతా విమానాన్ని ఎయిరిండియా ఆఖరు నిమిషంలో రద్దు చేసింది. ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోవా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. -
టేకాఫ్ రద్దు.. తప్పిన విమాన ప్రమాదం
న్యూఢిల్లీ: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై వేగంగా వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని సకాలంలో గుర్తించడంతో టేకాఫ్‌ను రద్దు చేశారు. ఆ సమయంలో గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేందుకు పైలట్లు బ్రేకులు వేసి, ప్రమాదం జరగకుండా చూశారు.సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాల్సిన ఏఐ2403 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు తమ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించి టేకాఫ్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన దరిమిలా ప్రయాణీకులంతా దిగిపోయారని, ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఈ ఘటనకు ముందు ముంబైలో కొచ్చికి వెళుతున్న విమానం వర్షంలో తడిసిన రన్‌వేను తప్పించుకుని, విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం తలెత్తింది. ఒక ఇంజిన్‌తో పాటు రన్‌వే కూడా దెబ్బతింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.ఇదిలావుండగా గత ఆరు నెలల్లో ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలియజేసింది. గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతిచెందారు. 11ఏ సీటులో ఉన్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. -
‘ఆ టైమ్‌లో కిటికీలు తెరిచే ఉంచొచ్చు’.. విమాన ప్రయాణికులకు డీజీసీఏ వరం
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే వార్త ఇది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో కిటికీలో నుంచి బయటకు చూడాలనే ప్రయాణికుల ఆశ నెరవేరనున్నది. భారత వైమానిక దళంలోని జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లలో (జేయూఏఎస్))విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను మూసివేసి ఉంచాలనే నిబంధనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఉపసంహరించుకుంది. అయితే, విమానాశ్రయాలలో గ్రౌండ్ లేదా ఏరియల్ ఫోటోగ్రఫీపై నిషేధం కొనసాగుతుంది.పలు భద్రతా కారణాల దృష్ట్యా గతంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను కిందికి ఉంచాలంటూ డీజీసీఏ అన్ని వాణిజ్య, చార్టర్, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లకు సూచించింది. ఈ సూచన ముఖ్యంగా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్‌లను ఉద్దేశించి చేశారు. ఇప్పుడు ఈ నియమాన్ని సడలించారు. అయితే ఫోటోలు, వీడియోలు తీయడంపై గల నిషేధం భద్రతా కారణాల దృష్ట్యా అలాగే కొనసాగనుంది. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని డీజీసీఏ కోరింది.భారత వైమానిక దళం సూచనల ప్రకారం, భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీపై నిషేధం చాలా ముఖ్యమైనదని డీజీసీఏ స్పష్టం చేసింది. టేకాఫ్, ల్యాండింగ్ లేదా విమానం రన్‌వేపై ఉన్నప్పుడు ప్రయాణికులను ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతించరు. ఈ నియమం ముఖ్యంగా జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లు అని పిలిచే ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లకు వర్తిస్తుంది. పౌర, సైనిక విమాన కార్యకలాపాలు ఈ విమానాశ్రయాలలో కొనసాగుతాయి. పఠాన్‌కోట్, శ్రీనగర్, ఆగ్రా, బరేలీ, గ్వాలియర్ తదితర ఎయిర్‌బేస్‌లలో ఫోటోగ్రఫీపై నిషేధం వర్తిస్తుంది. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్‌గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్‌వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
లక్నో ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వర్షాలు.. వరదనీటిలో రన్‌వే
లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. 📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational. However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు. -
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. #WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's KathmanduDetails awaited pic.twitter.com/DNXHSvZxCz— ANI (@ANI) July 24, 2024ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది. కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. #BREAKING : A plane has crashed at Tribhuvan International Airport. Sources at TIA reported that the aircraft skidded off the runway during takeoff as it was departing for Pokhara with 19 passengers. #Nepal #planecrash #TribhuvanInternationalAirport #skid #landing #airport… pic.twitter.com/ILnl0zQnZH— mishikasingh (@mishika_singh) July 24, 2024 -
టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది
మాడ్రిడ్: టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేనంత ఎక్కువ బరువుందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దించేశారు..! ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని లాంజారోట్ నుంచి యూకేలోని లివర్‌పూల్‌కు ఈజీ జెట్‌కు చెందిన విమానం బుధవారం రాత్రి 9.45కు బయలుదేరాల్సి ఉంది. విమానంలో బరువు ఎక్కువగా ఉండటానికి తోడుగా రన్‌వే పొడవు తక్కువగా ఉండటం, అననుకూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ కష్టంగా ఉందంటూ పైలట్ ప్రకటించారు. టేకాఫ్ తీసుకోవడం ప్రమాదకరమంటూ వారికి తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం బరువు కొద్దిగా తగ్గడమేనని వివరించారు. సుమారు 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే వారికి బహుమానంగా 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత విమానంలో పంపిస్తామని సర్దిచెప్పి 19 మంది ప్రయాణికులను విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో, రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్
సియోల్: 218 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బందితో టేకాఫ్‌కు సిద్ధమైన విమానంలో లైవ్ బుల్లెట్లు కన్పించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానయాన సంస్థ టేకాఫ్ క్యాన్సల్ చేసుకుని ఫ్లైట్‌ను తిరికి టెర్మినల్‌కు తీసుకెళ్లింది. ప్రయాణికులతో పాటు సిబ్బందిని కిందకు దింపేసింది. దక్షిణకొరియాలోని ఇంచెవాన్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడి వద్ద 9ఎంఎం బుల్లెట్లు రెండు దొరకడంతో సిబ్బంది భయాందోళన చెంది టేకాఫ్ రద్దు చేసింది. అయితే పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించినా బుల్లెట్లు విమానంలోకి ఎలా చేరాయో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, విమానయాన సంస్థ కూడా దీన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు. బుల్లెట్లు కన్పించిన కారణంగా ఉదయం 7:45కు టేకాఫ్ కావాల్సిన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యంగా 11:00 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఎలాంటి ఉగ్రముప్పు లేదని అధికారులు నిర్ధరించుకున్న తర్వాతే విమానం తిరిగి బయలుదేరింది. దక్షిణ కొరియాలో కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 75,300 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అయినా విమానంలోకి బుల్లెట్లు ఎలా తీసుకెళ్లారో అంతుచిక్కడం లేదు. చదవండి: చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం -
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
-
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మంచిరోజులు రానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్ కల్రాక్ కన్సార్షియం వెల్లడించింది. నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నాయి. చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే -
విమానం టేకాఫ్‌కు ముందు షాకిచ్చిన ప్యాసింజర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన మధ్య ఒక విమాన ప్రయాణికుడి నిర్లక్ష్య వైఖరి కలకలం రేపింది. విమానం మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకుంటుందనగా తనకు కరోనా పాజిటివ్ అంటూ ప్రయాణికుడు బాంబు పేల్చాడు. దీంతో హతాశులైన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపి వేసి, అధికారులకు సమాచారమిచ్చారు. ఢిల్లీ నుండి పూణే బయలుదేరిన ఇండిగో 6ఇ -286 విమానంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్)సిద్ధమవుతుండగా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి, పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌కు పరిస్థితిని వివరించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన సదరు ప్రయాణికుడిని అంబులెన్స్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్‌కు తరలించారు అధికారులు. ఆ తరువాత ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించి, ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం మొత్తం శానిటైజ్ చేసిన తరువాత సుమారు గంటన్నర ఆలస్యంగా విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. అలాగే ప్రయాణీకులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కాగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. గత ఏడాది మార్చి నుంచి జాతీయ,అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ప్రత్యేక నిబంధనలతో దేశీయంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయంగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని డీజీసీఏ మార్చి 31, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు రెక్కలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇండియా టేకాఫ్‌కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజరీ అయిన కల్రాక్ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం జెట్ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్ చేసిన బిడ్‌ను జెట్ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్–జలాన్‌ల కన్సార్షియం బిడ్‌లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జెట్‌ను దక్కించుకునే వేటలో ఎఫ్ఎస్టీసీ, బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ సైతం పోటీపడ్డాయి. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి, దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీ అప్పులు రూ.8,000 కోట్లకు ఎగబాకాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలతోసహా రూ.40,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఈ సంస్థలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కోల్‌కతాలో తమ కుటుంబ వ్యాపారమైన పేపర్ ట్రేడింగ్‌లో మురారీ లాల్ జలాన్ తన కెరీర్‌ను 1980లో ప్రారంభించారు. పేపర్ తయారీ, రియల్టీ, హెల్త్‌కేర్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రష్యా, యూఏఈ వంటి దేశాల్లో విస్తరించారు. జెట్ డీల్‌తో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది -
విమానాలకు టేకాఫ్ సమస్యలు
-
రన్‌వే మీద జీపు; విమానంకు తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన ఎ321 విమానంకు శనివారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. పుణే విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఉన్న జీపును, డ్రైవర్‌ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్యూస్‌లేజ్ విభాగం(విమానం బాడీ) కాస్త దెబ్బతింది. అయితే విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!) ఇదే విషయమై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు స్పందిస్తూ.. 'పుణే ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ సమయంలో 120 నాట్స్ వేగంతో ఉంది. అయితే రన్‌వే మీద జీపును గమనించిన పైలట్ కాస్త ముందుగానే విమానాన్ని గాల్లోకి లేపడంతో విమానం బాడీ కాస్త దెబ్బతింది. అయితే విమనంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదానికి గురవ్వలేదు. పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రన్‌వేపై ఏదైనా గుర్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పూణే ఎటిసి(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సమన్వయం చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు సూచించాము. దీంతో పాటు విమానంలోని కాక్‌పిట్ రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఎయిర్ఇండియాకు తెలిపాం' అని పేర్కొన్నారు. (సీఎం ప్రమాణ స్వీకారం.. 50 మంది అతిథులు వాళ్లే..!) -
అకస్మాత్తుగా టేకాఫ్ రద్దు, విమానంలో కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ మూలేకర్ తెలిపారు. -
ఇండిగో మరో నిర్వాకం
ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో నిర్వాకం ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసింది. ప్రయాణికుడి పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే తాజాగా మరో వివాదంతో ఇండిగో సంస్థ వారల్లో నిలిచింది. సంబంధిత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఉండగానే అనుకున్న సమయానికంటే.. విమానం ముందుగా బయలుదేరిపోవడం ఆందోళన రేపింది. గోవా నుంచి హైదరాబాద్ విమానం షెడ్యూల్ సమయానికి కంటే ముందుగానే టేక్ఆఫ్ తీసుకుంది. దీంతో బోర్డింగ్ పాస్‌లతో ఎదురుచూస్తున్న 14 మంది ప్రయాణికులు ఉసూరుమన్నారు. ఇదేమి నిర్వాకమంటూ ఎయిర్‌లైన్స్‌పై మండిపడుతున్నారు. గోవా విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన చోటుసుకుంది. 6ఈ 259 ఇండిగో విమానం సోమవారం రాత్రి 10.50 గంటలకు గోవానుంచి బయలుదేరాల్సి ఉంది, కానీ ఎటువంటి ప్రకటన చేయకుండానే 25 నిమిషాల ముందు బయలుదేరిపోయిందని ప్రయాణీకులు ఆరోపించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 12.05 లకు చేరాల్సి ఉండగా, 11.40 నిమిషాలకే చేరుకుందని వాదించారు. మేము లేకుండా తమ లగేజీ విమానంలో ఎలా తీసుకెళ్తారు.. ఇది సెక్యూరిటీ లోపం కాదా అని ప్రయాణికుడు డా. సుదర్శన్ ప్రసాద్ ధ్వజమెత్తారు. కనీసం ఎనౌన్స్మెంట్ కూడా చేయలేదని మరో ప్రయాణికుడు ఆరోపించారు. అంతేకాదు టికెట్లకోసం రూ.55,000 చెల్లించమని అడిగారని పాసెంజర్ ఆరాధన పోదావల్లి వాపోయారు. సమయానికి ఎవరైనా ప్రయాణికులు రాకపోతే... ఎలాంటి తటపటాయింపు లేకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఎయిర్ లైన్స్ అధికారులు.. విమానాన్నిఎందుకు ముందుగా పంపించాల్సి వచ్చింది.. మరి దీనికి జరిమానా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండిగో అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రయాణికుల వాదనలను వ్యతిరేకించారు. అనేకసార్లు లౌడ్ స్పీకర్లో ప్రకటించినా ఫలితం లేకపోవడంతో వారి ప్రయాణికులు అందించిన ఫోన్ నంబర్లను సంప్రదిస్తే..వారి ట్రావెల్ ఏజెంట్ థామస్ కుక్ రిసీవ్ చేసుకున్నారని, పాసెంజర్ల ఫోన్ నంబర్లు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపింది. అంతేకాదు వారికోసం అనేక ప్రయత్నాలు చేశామని ఆయన తెలిపారు. బోర్డింగ్ గేటు దగ్గరికి అనుకున్న సమయం రాత్రి10.30కే ముగియగా వారు 10.33కు చేరుకున్నారు అందు వారిని "గేట్ నో-షో"గా ప్రకటించినట్టు తెలిపారు. అలాగే తమవైపు ఎలాంటి తప్పు లేకున్నా...వారిని మరుసటి విమానంలో ఉచితంగా తరలించామంటూ తమని తాము సమర్ధించుకున్నారు. -
ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్టు
సాక్షి, ముంబై: ముంబైలోని సహార్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో ఒకే రన్ వే పై ఏకంగా 969 విమానాల (టేకాఫ్, ల్యాండింగ్) రద్దీని నియంత్రించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అందుకు ప్రధాన కారణం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం, ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎయిర్ పోర్టు అథారిటీ వర్గాలు తెలిపాయి. 2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు (టేకాఫ్, ల్యాండింగ్) ఏటీసీ సిబ్బంది నియంత్రించేవారు. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52కు చేరింది. ఇదివరకు 24 గంటల్లో 852 విమనాలు రాకపోకలు సాగించినట్లు రికార్డులు ఉన్నాయి. ప్రతీరోజు రాకపోకలు సాగించే విమానాలకు తోడుగా ఎప్పుడైన అదనంగా విమానాల సంఖ్య పెరిగితే వాటిని నియంత్రించే సామర్ధ్యం తమ సిబ్బందికి ఉందని ఏటీసీ జనరల్ మేనేజరు ఆర్.కే.సక్సేనా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మొదలుకుని శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో మొత్తం 969 విమానాలను నియంత్రించినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ సమయంలో ఎక్కువ విమానాలు టేకప్, ల్యాండింగ్ అయ్యాయనేది చెప్పడం కష్టమని తెలిపారు. కాగా నిర్వాహణ పనుల కోసం ప్రతీరోజు రన్ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నియమాలున్నాయి. ఆ ప్రకారం 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు స్పష్టమైతోందని ఆయన అన్నారు. ఇదిలాఉండగా ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్ వేపై ఏ–380 లాంటి భారీ విమానాలు టేకాప్, ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఈ రన్ వే కు క్యాట్–3 గ్రేడ్ లభించింది. సాధ్యమైనంత వరకు రన్ వే ను ఖాళీ చేస్తే వెనక వచ్చే విమనాలకు అవకాశం లభిస్తుంది. పూర్వం ఒక్కో విమానం ల్యాండింగ్ లేదా టేకప్ చేయడానానికి 60 సెకండ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు 47–48 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. దీంతో విమానాలు రన్ వే మీదుగా టేకప్ లేదా ల్యాండింగ్ ఎక్కువ సంఖ్యలో చేయడానికి వీలుపడుతుందని సక్సేనా అన్నారు. -
ఇంట్లో నుంచే ఎగిరే విమానం
విమానంలో ప్రయాణించాలంటే విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు ఇంట్లో నుంచే ఎక్కడికైనా ఎగిరిపోవొచ్చు, తిరిగి ల్యాండ్ అవ్వొచ్చు. విమానాలకు ఎంతో ఖర్చుతో కూడిన ఇంధనం అవసరమౌతుంది, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా?..ఇంట్లో మనం సాధారణంగా వాడే కరెంట్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేస్తే చాలు గాల్లో హాయిగా చక్కర్లు కొట్టి రావొచ్చు. నలుగురు జర్మన్ ఇంజనీర్లు కలిసి ఇంట్లో నుంచే గమ్యస్థానాలకు చేరే కొత్త రకం మినీ విమానం 'లిలియం' డిజైన్‌ను చూస్తే 2018 వరకు ఇది సాధ్యమయ్యేదిలానే కనిపిస్తుంది. రెండు సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త ఆల్ట్రాలైట్ చిన్న విమానం లిలియం. ఇది ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు. లిలియం స్టార్టప్‌ను మునిచ్ యూనివర్సిటీ విద్యార్థులు..డానియల్ వీగాండ్, పాట్రిక్ నాథన్, సెబాస్టియన్ బోర్న్, మాథియాస్ మీనర్లు కలిసి ప్రారంభించారు. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీలో(ఈఎస్ఏ) బిజినెస్ ఇంక్యుబేటర్‌లో లిలియం ప్రాజెక్టును హోస్ట్ చేశారు. 'వీగాండ్ తమ కాన్సెప్ట్‌ను ప్రాక్టికల్‌గా వివరించారు..వాతావరణానికి కలిగే లాభాలను వివరించారు. ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడటం వల్ల తక్కువ శబ్ధం ఉద్గారమవ్వడంతో పాటూ వాతావరణానికి ఎలాంటి హానీ జరగదు' అని ఈఎస్ఏ తెలిపింది. రోజూ వారి అవసరాల కోసం ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నట్టు దీని డిజైనర్లలో ఒకరు డానియల్ వీగాండ్ తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన భారీ ఎయిర్ పోర్టుల అవసరం లేకుండానే ఈ విమానం సునాయాసంగా ఎగిరిపోతుంది. ఇంట్లోనే విమానానికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా నిర్మాణదశలోనే ఉన్న ఈ గుడ్డు ఆకారంలో ఉండే లిలియం విమాన అమ్మకాలు 2018 ఏడాది వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానం.. గంటకు 400కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. 'లిలియం ఇంజన్లలో ఉపయోగించే టెక్నాలజీతో జెట్ విమానాలు, హెలీకాప్టర్లలో వచ్చే శబ్ధాలకన్నా చాలా రెట్లు తక్కువ వస్తుంది. దీనికి ఇంట్లో వాడే సాకెట్‌తోనే ఛార్జింగ్ చేయోచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే దీంట్లో ప్రయాణించొచ్చు' అని వీగాండ్ తెలిపారు. లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరికి చెందిన దీన్ని నడపడానికి పైలెట్ లైసెన్స్ ఉండి కేవలం 20 గంటల ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. దీని ధర విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకపోయినా..ఇప్పటికే ఉన్న మినీ విమానాలకంటే తక్కువకే ఇది లభిస్తుందని ఈఎస్ఏ తెలిపింది. -
టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ల్యాండింగ్
హైదరాబాద్: టేకాఫ్ అయిన పది నిముషాలకే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ల్యాండింగ్ అయిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం శనివారం ఉదయం టేకాఫ్ తీసుకుని లండన్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ గుర్తించి... అప్రమత్తమైయ్యాడు. సాంకేతిక సమస్యపై శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు వివరించాడు. దీంతో విమానం తిరిగి వెనక్కి వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారుల అనుమతి తీసుకున్నాడు. అనంతరం విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశాడు. పది నిముషాల్లోనే విమానాన్ని తిరిగి ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమైందో తెలియక వారు ఆందోళన చెందారు. సాంకేతి సమస్య తలెత్తిందని విమాన సిబ్బంది చెప్పారు. మరమ్మతులు పూర్తి చేసుకుని గంట తర్వాత విమానం మళ్లీ తిరిగి లండన్ బయలుదేరింది. -
హెలికాప్టర్లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!
హెలికాప్టర్లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది. ‘గ్రీస్డ్ లైట్నింగ్ లేదా జీఎల్-10(అంటే మెరుపు వేగం)’ అని పేరుపెట్టిన ఈ విమానానికి రెక్కలపై 8, తోక వద్ద 2 మొత్తం పది ఇంజిన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ, డీజిల్‌తోనూ నడుస్తుంది. 6.1 మీటర్ల పొడవున్న రెక్కలతో ప్రాథమిక నమూనాగా తయారుచేసిన ఈ బుల్లి డ్రోన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరీక్షించగా, హెలికాప్టర్ కన్నా నాలుగు రెట్లు సమర్థంగా ప్రయాణించింది. వ్యవసాయ పర్యవేక్షణకు, నేలను మ్యాపింగ్ చేయడానికి, ఇతర పనులకు జీఎల్-10 ఉపయోగపడనుందని నాసా వెల్లడించింది. నాలుగు సీట్లుండే ప్రైవేటు విమానంగానూ దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపింది. -
రన్ వే పై కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్‌వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్‌లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది. కొద్ది క్షణాలకే విమానం రన్‌వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.