విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం | Bird Hit After Take Off: Air India Flight Returns To Nagpur | Sakshi
Sakshi News home page

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం

Oct 25 2025 5:18 PM | Updated on Oct 25 2025 5:33 PM

Bird Hit After Take Off: Air India Flight Returns To Nagpur

ఢిల్లీ: నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానానికి పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి  విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్‌లో సౌండ్‌ రావడంతో గుర్తించిన పైలట్‌.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.

మరో వైపు, హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్‌, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement