ఇండిగో సంక్షోభంపై రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఇండిగో’లో తలె త్తిన గందరగోళ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ‘ప్రతి రంగంలోనూ ఆరోగ్య కర మైన పోటీ ఉండాలే తప్ప, మ్యాచ్– ఫిక్సింగ్ ఏకపక్ష పోకడలు తగవు. విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు తదితరాలతో సామాన్య భారతీయులు ఇందుకు మూల్యం చెల్లిస్తున్నారు’అని శుక్రవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
దీంతోపాటు ఆయన గతేడాది వార్తా పత్రికకు రాసిన కథనాన్ని షేర్ చేశారు. ఈస్టిండియా కంపెనీ 150 క్రితమే మూతపడినా అది మరో రూపంలో తిరిగి అవతరించిందంటూ అందులో ఆయన పేర్కొ న్నారు. కాంగ్రెస్ పవన్ ఖేరా కూడా ఇండిగో సమ స్యకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ‘ఇద్ద రు వ్యక్తులు పార్టీని నడుపుతున్నారు. ఇద్దరే ప్రభు త్వాన్నీ నిర్వహిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులే వ్యాపా రాలను శాసిస్తున్నారు. ఇప్పుడు జరుగుతు న్నదంతా ఇదే’అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.


