న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే అధికారిక విందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం అందింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలను బలపరచడానికి ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు(శుక్రవారం) రాత్రి పుతిన్‌తో కలిసి శశిథరూర్ విందలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జన ఖర్గేలక ఆహ్వానం అందలేదట.
కేవలం కాంగ్రెస్ నుంచి శశిథరూర్‌ను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్ల తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీతో ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్న శశిథరూర్.. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో విందుకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడికి ఇచ్చిన మర్యాదను తన ఆహ్వానం ప్రతిబింబిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ (External Affairs)కి శశి థరూర్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ బయట శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ ఇదొక సాంప్రదాయం. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వమే మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ దీన్ని ప్రారంభించింది. ఏ దేశం నుంచైనా అధ్యక్షులు ఇక్కడకు(భారత్) వస్తే ప్రతిపక్షం నుంచి ఒకరు హాజర కావడం జరగుతుంది. కానీ ప్రస్తుత రోజల్లో విదేశీ నేతల్ని.. ప్రతిపక్ష నేతలు కలవ కూడదని కూడా కొన్ని ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి’ అని అని స్పష్టం చేశారు.


