రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ | Russian President Putin India Visit And Meeting Updates | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Dec 5 2025 10:37 AM | Updated on Dec 5 2025 11:06 AM

Russian President Putin India Visit And Meeting Updates

Putin India Tour Updates..

👉 రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మోదీ. 
  • కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 

 

👉భారత్‌ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

షెడ్యూల్‌ ఇలా..

  • ఉదయం 11 గంటలకు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం
  • 11:30 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్న పుతిన్
  • ఉదయం 11:50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో పుతిన్ సమావేశం
  • మధ్యాహ్నం 1.50 గంటలకు మోదీ, పుతిన్ మీడియా సమావేశం
  • మధ్యాహ్నం 3:40కి భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్
  • రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  
  • రాత్రి 9:30 గంటలకు తిరిగి మాస్కో వెళ్లిపోనున్న పుతిన్

కీలక చర్చలు..

  • రక్షణ, వాణిజ్య, పౌర అణు ఇంధనం, ముడిచమురు తదితర రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న  దేశాధినేతలు
  • ఎస్-400, 5 జనరేషన్ ఫైటర్ జెట్స్, సబ్‌మెరైన్స్, ఆయుధాల తయారీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ అంశాలపై ఒప్పందాలు కుదిరే  అవకాశం  
  • ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం
  • అమెరికా ఆంక్షలు నేపథ్యంలో రష్యా ముడిచమురు దిగుమతిని కొంతమేర తగ్గించిన భారత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement