ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు.. విచారణ లేకుండానే ఐదేళ్లకు పైగా జెలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో ఈ కేసులో విచారణ పూర్తి చేసిన జస్టి‹స్ ఎ.ఎస్.గడ్కరీ, ఆర్.ఆర్.¿ోంస్లేలతో కూడిన డివిజన్ బెంచ్, ఆయనను విడుదల చేయాలని, లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌ను సమరి్పంచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి ఈ ఉత్తర్వును నిలిపివేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైకోర్టును కోరింది.
బాబు ఇప్పటికే విచారణలేకుండానే సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారని, విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేనందున ఎన్‌ఐఏ అప్పీలును తిరస్కరించింది. ఆయన పూర్తి పేరు హనీబాబు ముసలియారీ్వట్టిల్ తరయిల్. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన వ్యక్తి. 2017 డిసెంబర్ 31న పూణేలోని శనివార్‌వాడలో కబీర్‌కళా మంచ్ నిర్వహించిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2020 జూలైలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిషేధిత సీపీఐ(ఎంఎల్) నాయకుల సూచనల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు, భావజాలాన్ని హనీబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. 59 ఏళ్ల హనీ బాబు అప్పటి నుంచి తలోజా జైలులో ఉన్నారు.


