ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు..
మెహబూబా పాటకు డ్యాన్స్.. బ్యాక్‌గ్రౌండ్ మంటలు
బాలీవుడ్ మూవీ షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అంతా మంచి జోష్‌లో ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఈలలు-కేరింతలు అన్నట్లు ఉంది. అయితే సడెన్‌గా అంఆ నిశ్భబ్దం అయ్యారు. డ్యాన్సర్ వెనుకాల గోడకు అమర్చిన చెక్క నుంచి మంటల జాడ కనిపించడంతో ఏదో జరగబోతుందని గ్రహించారు. కొంతమంది ఏం జరుగుతుందోనని పైకి వెళ్లగా, మరికొంతమంది వంట గదిలో దాక్కునే యత్నం చేశారు.
ఇక డ్యాన్సర్లు, మ్యుజిషియన్లు అంతా బయటకు పరుగులు తీశారు. వారి మ్యూజికల్ సామాగ్రిని అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయే యత్నం చేశారు. ఆ క్లబ్‌ను అంతే వేగంగా మంటలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది వరకూ ప్రాణాలు కోల్సోగా, అందులో ఎక్కువమంది ఆ క్లబ్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఆ క్లబ్ యాజమాన్యం అజాగ్రత్త వల్ల జరిగిందా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు.
Watch the roof as the fire erupts.
Final Moments before the deadly Arpora goa fire.
At least 25 ppl dead. Bodies charred in the deadly fire which erupted from a suspected cylinder blast pic.twitter.com/OnCrR5eTyH— Shivan Chanana (@ShivanChanana) December 7, 2025
ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారం గందరగోళం
మంటలు చెలరేగిన తర్వాత అక్కడున్న తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో బయటకు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. చిన్నపాటి, ఇరుకుగా ఉన్నటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. అయితే చాలామంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ , 25 మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
గోవాలో ఇలా జరగడం ఇదే తొలిసారి.. : సీఎం
ఈ విషాదకర ఘటనపై గోవా సీఎం ప్రమోద సావంత్ స్పందించారు. ‘ గోవాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఆ క్లబ్‌లో పై ఫ్లోర్ నుంచి మంటల వ్యాపించాయని, అక్కడ డోర్స్ ఏర్పాటు కూడా సరిగా లేదన్నారు. చాలామంది తప్పించుకునే యత్నం చేశారని, కొంతమంది మాత్రం అక్కడ నుంచి బయటపడలేకపోయి ప్రాణాలు కోల్పోయారన్నారు. చాలామందికి ఏమీ చేయాలో తెలియక అండర్ గ్రౌండ్ ఏరియాకు వెళ్లి మృత్యువాత పడ్డారన్నారు.
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం


