బీసీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బార్ కౌన్సిల్ ఆ‹ఫ్ ఇండియా (బీసీఐ)కి సుప్రీంకోర్టు సూచించింది. ‘రాష్ట్ర బార్‌కౌన్సిల్‌లలో 30శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీఐ నియమాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం. కొన్ని ఆఫీస్ బేరర్ పోస్టులు కూడా అందుబాటులో ఉండాలి ’ప్రదాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టి‹స్ జోయ్ మాల్యా బాగి్చలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్ర బార్ కౌన్సిల్‌లలో మహిళా ప్రాతినిధ్యం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం అటువంటి రిజర్వేషన్లను అమలు చేయడానికి అడ్వకేట్స్ చట్టానికి సవరణలు అవసరమని బీసీఐకి తెలిపింది. అయితే రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, తక్షణ మార్పులు కష్టమని బీసీఐ తరపు న్యాయవాది గురుకుమార్ ధర్మాసనానికి తెలిపారు.
అంతేకాదు.. మహిళా న్యాయవాదులు పోటీ చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా.. మహిళా న్యాయవాదుల సర్వే ఆధారంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వర్క్‌షా‹ప్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. 83 మంది శాతం మహిళా న్యాయవాదులు బీసీఐలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించింది. ఒక ఆఫీ‹స్ బేరర్ పదవిని మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేయాలని సూచించింది.


