ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభం ఎంతో ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దేశవ్యాప్తంగా విమానాల అంతరాయాలు వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఒక టెకీ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌ను వీడియో కాల్‌తో సరిపెట్టుకోవాల్సింది. మరో సంఘటన తన బిడ్డకు అధిక రక్తస్రావం అవుతోంది, కనీసం శ్యానిటరీ ప్యాడ్లు ఇవ్వండి అని వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముందస్తు నోటిఫికేషన్ లేకుండా విమానాల్ని రద్దు చేయడం ఒకెత్తు అయితే, ఈ గంగరదోఠం మధ్య మానసిక ఆందోళనతోపాటు, గమ్య స్థానాలకు చేరుకునేందుకు, అక్కడి ఖర్చులు మరింత భారంగా మారడం మరో ఎత్తు. ఇదే అదును ఇతర విమానయాన సంస్థలు తమ ధరలను విపరీతంగా పెంచేయడం దారుణం.
బెంగళూరుచెందిన ఒక మహిళది మరో హృదయ విదారక గాథ. వేలాది మంది ప్రయాణీకులలో ఒకరైన నమిత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. తండ్రి అస్థికలను పుణ్య నదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్‌కు బయలుదేరిన నమిత మహిళ బెంగళూరులో చిక్కుకుంది. చేతుల మధ్య కలశం పట్టుకుని, చితాభస్మాన్ని అత్యవసరంగా నిమజ్జనం చేయాలి, హరిద్వార్ చేరుకోవడానికి సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంది.
"నా తండ్రి చితాభస్మాన్ని నాతో తీసుకెళ్తున్నాను. బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుండి నా తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి హరిద్వార్‌కు వెళ్లాలి" అని నమిత చెప్పింది. అంతేకాదు మరో విమానం టికెట్ బుక్ చేయాలంటే ఒక్కొక్కరికీ 60 వేలుఅవుతుంది. తాము ఐదుగురం ఉన్నామని వాపోయింది. ఇప్పుడు రైలు లేదా బస్సు టిక్కెట్లు అందుబాటులో లేవని కూడా నమిత పేర్కొంది. మరోవైపు నుంచి హరిద్వార్ నుండి తన స్వస్థలమైన జోధ్‌పూర్‌కు రిటన్ ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానాల ఆలస్యం కారంగా అవి కూడా రద్దయ్యే పరిస్థితి.
ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్


