హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం! | Aircraft to fly the helicopter to take off | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

May 5 2015 2:19 AM | Updated on Sep 3 2017 1:25 AM

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

హెలికాప్టర్‌లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!

హెలికాప్టర్‌లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది.

హెలికాప్టర్‌లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది. ‘గ్రీస్డ్ లైట్నింగ్ లేదా జీఎల్-10(అంటే మెరుపు వేగం)’ అని పేరుపెట్టిన ఈ విమానానికి రెక్కలపై 8, తోక వద్ద 2 మొత్తం పది ఇంజిన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ, డీజిల్‌తోనూ నడుస్తుంది.


6.1 మీటర్ల పొడవున్న రెక్కలతో ప్రాథమిక నమూనాగా తయారుచేసిన ఈ బుల్లి డ్రోన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరీక్షించగా, హెలికాప్టర్ కన్నా నాలుగు రెట్లు సమర్థంగా ప్రయాణించింది. వ్యవసాయ పర్యవేక్షణకు, నేలను మ్యాపింగ్ చేయడానికి, ఇతర పనులకు జీఎల్-10 ఉపయోగపడనుందని నాసా వెల్లడించింది. నాలుగు సీట్లుండే ప్రైవేటు విమానంగానూ దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement