కొత్తగా 7 రూట్లపై ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ దృష్టి | Etihad Airways announced seven new routes | Sakshi
Sakshi News home page

కొత్తగా 7 రూట్లపై ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ దృష్టి

Jan 29 2026 8:54 AM | Updated on Jan 29 2026 8:54 AM

Etihad Airways announced seven new routes

సర్వీసుల విస్తరణకు అనుమతులు లభిస్తే భారత్‌లో మరిన్ని నగరాలకు ఫ్లయిట్స్‌ని నడిపే యోచనలో ఉన్నట్లు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో ఆంటోనోల్డో నెవిస్‌ తెలిపారు. గోవాతో పాటు 5–7 నగరాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని వివరించారు. అలాగే హైదరాబాద్, అహ్మదాబాద్‌లాంటి నగరాలకు ఫ్లయిట్స్‌ని రెట్టింపు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 11 నగరాలకు సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపారు.

విదేశీ విమానయాన సంస్థలకు ట్రాఫిక్‌ హక్కులపై పరిమితులు విధించడం భారత్‌కే నష్టం కలిగిస్తుందని నెవిస్‌ చెప్పారు. ముందుగా మార్కెట్‌ని విస్తరించేందుకు విదేశీ ఎయిర్‌లైన్స్‌కి అవకాశం లభిస్తే, తర్వాత దాన్ని దేశీ విమానయాన సంస్థలు అందిపుచ్చుకోవచ్చని వివరించారు. 2025లో గ్లోబల్‌గా కంపెనీ 20 శాతం వృద్ధి సాధించగా, భారత మార్కెట్లో మాత్రం ఒక మోస్తరు స్థాయికే పరిమితమైనట్లు పేర్కొన్నారు. తమ విజన్‌ 2030లో భారత మార్కెట్‌ కీలకంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో భారత్‌లో 15–20 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామని, ఒకవేళ అది సాధ్యపడకపోతే ఇతర మార్కెట్లవైపు దృష్టి సారిస్తామని వివరించారు.

ఇదీ చదవండి: ఏజెంటిక్‌ ఏఐ నిపుణులకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement