50 శాతం పైగా కొరత
2030 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు దేశీ మార్కెట్
క్వెస్‌కార్ప్ నివేదిక
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్‌ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్‌ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా
ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్‌డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.
మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.
టెక్, సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.
ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్‌మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్‌గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.
మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్‌సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్‌లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్‌కి దిశా నిర్దేశం చేస్తోంది.
ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో బెంగళూరు, హైదరాబాద్‌ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్‌ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్‌సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్‌లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది.


