ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్‌బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్‌లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్‌కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్‌గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్‌గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్‌నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్‌రూమ్‌లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్‌నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్‌నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట.