Jet Airways: టేకాఫ్‌కు సిద్ధం!

Jet Flights Resume Operations in Q1 2022: Jalan - Sakshi

సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు మంచిరోజులు రానున్నాయి.  దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం వెల్లడించింది.

నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్‌వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకున్న జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్‌ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్‌వేస్‌ విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నాయి.

చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top