
లక్నో: లక్నో ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్‌వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్ విఫలమైంది. అతి కష్టంపై పైలట్.. విమానాన్ని రన్ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.
శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్‌వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్‌కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.