జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం
కొత్త చట్టం తెస్తున్న కేంద్రం
వికసిత్ భారత్ ఆజీవికా మిషన్‌గా పేరు
భారంలో 40 శాతం రాష్ట్రాల వాటా
పైగా ఏటా రాష్ట్రాలకు నిర్దిష్ట కేటాయింపులు
అంతకు మించితే రాష్ట్రమే భరించాలి
ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు
మండిపడుతున్న విపక్షాలు
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) చట్టం ఇక కనుమరుగు కానుంది. దాని స్థానంలో వికసిత భారత్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీజీ ఆర్‌ఏఏఎం–జీ) పేరిట కోటా చట్టాన్ని మోదీ సర్కారు తేనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇది గ్రామీణులకు ఏటా కనీసం 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుందని బిల్లు ప్రతిలో పేర్కొన్నారు. ఇది చట్టంగా అమల్లోకి వచ్చిన ఆర్నెల్ల లోపు అందులోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొత్త పథకాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం కాగా కొత్త చట్ట భారాన్ని మాత్రం రాష్ట్రాలు కూడా మోయాల్సి ఉంటుంది. దాన్ని ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 10 శాతంగా, ఇతర రాష్ట్రాలకు 40 శాతంగా నిర్ణయించారు. అసెంబ్లీలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో పథక వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి గా భరిస్తుంది. అంతేకాకు మరో మెలిక కూడా పెట్టారు. కొత్త పథకం కింద ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించి అంతటితో సరిపెడతారు. వ్యయం అంతకు మించితే సంబంధిత రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.
నాలుగింటిపై దృష్టి
కొత్త ఉపాధి హామీ పథకం ప్రధానంగా 4 రకాల పనులపై దృష్టి సారించనుంది. జలభద్రత ( నీటి సంరక్షణ, సాగునీరు, నీటి వనరుల పునరుజ్జీవం, అడవుల పెంపకం వంటివి), మౌలిక గ్రామీణ వసతులు (రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వంటివాటి నిర్మాణం, మెరుగుదల), జీవనాధార సంబంధిత వసతులు, వాతావరణానికి అనుగుణంగా సర్దుబాట్లు. ‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ 20 ఏళ్లుగా గ్రామీణులకు ఉపాధి భద్రత బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది. అయితే గ్రామాల్లో మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది‘ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
గాంధీ పేరెందుకు తీసేశారు? కేంద్రానికి విపక్షాల ప్రశ్నా్రస్తాలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పేరు మార్పు ప్రతిపాదనపై విపక్షాలు సోమవారం మండిపడ్డాయి. పథకం నుంచి గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ను ఎలాగైనా టాప్ మోదీ ప్రధాని అయిన నాటినుంచి చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సప్తగిరి ఉలక ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి అధికార బీజేపీ ఏం సాధిస్తోందని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాముఖంగా ప్రశ్నించారు. దీన్ని గాం«దీకి అవమానంగా రుణం కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ అభివరి్ణంచారు. పేరు మార్పు ద్వారా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్నే దుంపనాశనం చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి దుయ్యబట్టారు.


