పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయండి... స్థానికంగా ఉద్యోగాలు ఇప్పించండి
వ్యవసాయ అనుబంధ ఆవిష్కరణలు..చిన్న వ్యాపారాలకు మద్దతు కావాలి
తెలంగాణ రైజింగ్–2047 సర్వేలోప్రజాభిప్రాయం...ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్న 4 లక్షల మంది ప్రజలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి ఆవశ్యకత మరోమారు తేటతెల్లమైంది. చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రజలు బలంగా కోరుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 40 శాతానికి పైగా సత్వర ఉపాధి కోర్సులు కావాలని, ఈ దిశగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలని అడగడం గమనార్హం.
తెలంగాణను మూడు మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వాములను చేసింది. ఆన్‌లైన్ ద్వారా సిటిజన్ సర్వే నిర్వహించి ప్రజలు ఏ కోణంలో అభివృద్ధిని కోరుకుంటున్నారనే సమాచారం తీసుకుంది. ప్రజల అభిప్రాయాలను విజన్ డాక్యుమెంట్‌లోనూ పొందుపర్చింది.
» సిటిజన్ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతం మంది మొదటి ప్రాధాన్యం కింద ఉపాధి కల్పనా కోర్సుల గురించే ప్రస్తావించారు. ళీ ఆ తర్వాత ఎక్కువమంది చిన్న వ్యాపారాలకు మద్దతు లభించే విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు.
» వ్యవసాయ రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని కోరినవారు మూడో స్థానంలో ఉండడం గమనార్హం.
» తమ నివాసాలకు సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ళీ 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి కావాలంటే పారదర్శక పాలన జరగాలని కోరిన వారు నాలుగోవంతు కూడా లేరు. ళీ మహిళల భద్రత గురించి ఈ సర్వేలో పాలుపంచుకున్న వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ళీ ఆరోగ్య బీమా గురించి ప్రస్తావించిన వారు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
ప్రజాభిప్రాయమే భవిష్యత్‌కు బలం
ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పాల్గొన్నారని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో సర్వే జరిగిన తీరు, ప్రజల అభిప్రాయాలను కూడా పేర్కొంది. ఈ సర్వేలో మహిళలు, విద్యార్థులు, కారి్మకులు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు పాల్గొన్నారు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది యువత తమ అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా 2047 విజన్‌కు బలం చేకూర్చారని డాక్యుమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజారోగ్యం కోణంలో ప్రజలు అడిగినవి
ఆస్పత్రులు, మొబైల్ వ్యాన్లు, తక్కువ ఖర్చుకు వైద్య ప రీక్షలు, టెలీ మెడిసిన్, స్వచ్ఛమైన నీరు–పారిశుధ్యం, వ్యా ధుల నియంత్రణ, ఆరోగ్య బీమా సౌకర్యం, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, తక్కువ ఖర్చుతో మానసిక వైద్యం.
ఆర్థిక వృద్ధి కోణంలో...
సత్వర ఉపాధిని కల్పించే కోర్సులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, చిన్న వ్యాపారాలకు మద్దతు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మార్కెట్ మార్గదర్శకత్వం, పర్యాటక అభివృద్ధి, స్థానిక చేతి వృత్తులకు ప్రోత్సాహం.
స్థానికాభివృద్ధి, అవకాశాలపై....
సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు, స్థానికంగా ఉద్యోగాలు, పారదర్శక పాలన, మహిళాభద్రత, వారికి మంచి అవకాశాలు కల్పించడం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం.


