breaking news
employment courses
-
ఉపాధి కోర్సులు కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి ఆవశ్యకత మరోమారు తేటతెల్లమైంది. చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రజలు బలంగా కోరుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 40 శాతానికి పైగా సత్వర ఉపాధి కోర్సులు కావాలని, ఈ దిశగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలని అడగడం గమనార్హం. తెలంగాణను మూడు మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వాములను చేసింది. ఆన్లైన్ ద్వారా సిటిజన్ సర్వే నిర్వహించి ప్రజలు ఏ కోణంలో అభివృద్ధిని కోరుకుంటున్నారనే సమాచారం తీసుకుంది. ప్రజల అభిప్రాయాలను విజన్ డాక్యుమెంట్లోనూ పొందుపర్చింది. » సిటిజన్ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతం మంది మొదటి ప్రాధాన్యం కింద ఉపాధి కల్పనా కోర్సుల గురించే ప్రస్తావించారు. ళీ ఆ తర్వాత ఎక్కువమంది చిన్న వ్యాపారాలకు మద్దతు లభించే విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు. » వ్యవసాయ రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని కోరినవారు మూడో స్థానంలో ఉండడం గమనార్హం. » తమ నివాసాలకు సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ళీ 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి కావాలంటే పారదర్శక పాలన జరగాలని కోరిన వారు నాలుగోవంతు కూడా లేరు. ళీ మహిళల భద్రత గురించి ఈ సర్వేలో పాలుపంచుకున్న వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ళీ ఆరోగ్య బీమా గురించి ప్రస్తావించిన వారు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ప్రజాభిప్రాయమే భవిష్యత్‌కు బలం ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పాల్గొన్నారని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో సర్వే జరిగిన తీరు, ప్రజల అభిప్రాయాలను కూడా పేర్కొంది. ఈ సర్వేలో మహిళలు, విద్యార్థులు, కారి్మకులు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు పాల్గొన్నారు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది యువత తమ అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా 2047 విజన్‌కు బలం చేకూర్చారని డాక్యుమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది. ప్రజారోగ్యం కోణంలో ప్రజలు అడిగినవి ఆస్పత్రులు, మొబైల్ వ్యాన్లు, తక్కువ ఖర్చుకు వైద్య ప రీక్షలు, టెలీ మెడిసిన్, స్వచ్ఛమైన నీరు–పారిశుధ్యం, వ్యా ధుల నియంత్రణ, ఆరోగ్య బీమా సౌకర్యం, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, తక్కువ ఖర్చుతో మానసిక వైద్యం. ఆర్థిక వృద్ధి కోణంలో... సత్వర ఉపాధిని కల్పించే కోర్సులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, చిన్న వ్యాపారాలకు మద్దతు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మార్కెట్ మార్గదర్శకత్వం, పర్యాటక అభివృద్ధి, స్థానిక చేతి వృత్తులకు ప్రోత్సాహం. స్థానికాభివృద్ధి, అవకాశాలపై.... సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు, స్థానికంగా ఉద్యోగాలు, పారదర్శక పాలన, మహిళాభద్రత, వారికి మంచి అవకాశాలు కల్పించడం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం. -
సాధారణ డిగ్రీతో పాటు ఉపాధి కోర్సులు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు, ఉపాధి కల్పించే కోర్సులను అనుసంధానం చేసినట్టు యూనివర్సీటీ సహాయ సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ వచ్చిన ఆయన ఆదివారం మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో గల ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా, ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను జోడించినట్టు తెలిపారు. దీని ద్వారా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులతో పాటు, ఉపాధి పొందేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై విధిగా సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు ఉపాధి కోర్సును ఓ పాఠ్యాంశంలా చదవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఫీజులను కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. స్టడీ మెటీరియల్‌ను స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థుల చిరునామాలకు పంపుతామని చెప్పారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఆర్ఓయూఆన్లైన్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇంటర్.. దానికి సమాన విద్యార్హతగల వారు డిగ్రీలో జాయిన్ కావచ్చునన్నారు. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్ అవకాశం కల్పించినట్టు తెలిపారు. 1999 తర్వాత అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు, 2005 తర్వాత అడ్మిషన్ తీసుకున్న పీజీ విద్యార్థులకు ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడానికి రీ అడ్మిషన్ ఇస్తున్నట్టు విజయకృష్ణారెడ్డి వివరించారు. -
ఉన్నత విద్యకు నెలవు.. ఉపాధికి కొలువు
ఉద్యోగ, ఉపాధి కోర్సులకు యోగివేమన విశ్వవిద్యాలయం నెలవుగా మారుతోంది.. సంప్రదాయ కోర్సులతో పాటు వృత్తివిద్యా కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రవేశపరీక్షను జూన్ మొదటివారంలో నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వైవీయూ : ప్రతిష్టాత్మక యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు వైవీయూ సెట్–2018కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం నేడు 32 రకాల కోర్సులు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైవీయూసెట్–2018కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేందుకు మే నెల 15తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఆన్లైన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన మరుసటి రోజు వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పూర్తిచేసిన దరఖాస్తులను మే నెల 23వ తేదీలోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్లూయ.వైవీయూడీఓఏ.నెట్ వెబ్సైట్లో సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. జూన్ మొదటివారంలో ఈ పరీక్షను యోగివేమన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మాత్రమే నిర్వహిస్తారు. లభించే కోర్సులు.. నిర్వహించే పరీక్షలు... యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో 32 రకాల కోర్సులు అందుబాటులో ఉండగా వీటిలో ప్రవేశం పొందేందుకు 17 పరీక్షలను (సబ్జెక్ట్‌ల వారీగా) నిర్వహించనున్నారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బోటనీ (ప్లాంట్‌సైన్స్), కెమిస్ట్రీ (ఆర్గానిక్), ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంకాం, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఈడీ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్(కంప్యూటర్ అప్లికేషన్), ఎంపీఈడీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ జువాలజీ (అనిమల్ సైన్స్), ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఎస్సీ ఎర్త్‌సైన్స్ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎంఏ ఉర్దూ, ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్ డాటా సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ)లో ప్రవేశానికి ఫైన్ఆర్ట్స్పేరుతో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్‌లో ప్రవేశానికి మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ప్రవేశం పొందేందుకు అర్హులు ఎవరంటే.. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీలో సంబంధిత గ్రూపు సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎంఈడీలో ప్రవేశాలకు బీఈడీలో 50 శాతం మార్కులు, ఎంపీఈడీలో ప్రవేశానికి బీపీఈడీలో 40 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హతతో 5 సంవత్సరాల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో చేరే అవకాశం కూడా విద్యార్థులకు ఉంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 50 శాతం మార్కులు పొంది ఉంటే ప్రవేశాలు పొందవచ్చు. -
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఉపాధి కోర్సులు
కర్నూలు సిటీ: డిగ్రీలో వచ్చే ఏడాది నుంచి ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వైస్ చైర్మన్ నరసింహారావు, ఆర్యూ వీసీ నరసింహులు తెలిపారు. ఇందులో భాగంగా సీబీసీఎస్ సిలబస్‌లో చేయనున్న మార్పులపై శనివారం రాయలసీమ యూనివర్సిటీలో ఆయా యూనివర్సిటీలకు చెందిన వీసీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో రీజినల్ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కోర్సుల్లో సెమిష్టర్ల వారీగా ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ఆదేశించిందన్నారు. ఈ మేరకు సీబీసీఎస్ సిలబస్‌తో పాటు ఫౌండేషన్ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. ఇందుకు రాష్ట్రంలో 100 డిగ్రీ కాలేజీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఇందుకు జేకేసీ సహకారం, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. అనంతరం కొత్త కోర్సులపై వీసీలు, డీన్లు, ప్రభుత్వ డిగీ కాలజీల ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. çసమాశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సుబ్బారావు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సభ్యులు వరుణ్, ఎస్వీ వీసీ దామోదరం పాల్గొన్నారు.


