సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్‌సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.
విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణ
విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ
గోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్‌కు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు.



