‘జీతాలు ఇవ్వండి మహాప్రభో’
జలుమూరు: నరసన్నపేట వంశధార డివిజన్ పరిధిలోగల లస్కర్లు వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట బ్రాంచ్ కాలువ పెద్ద దూగాం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లస్కర్ల సంఘం యూనియన్ ప్రతినిధులు తాన్ని అప్పన్న, చిట్టినేని జనార్దన్‌లు తెలిపారు. వ్యవసాయ సీజన్‌లలో ఏడాదికి నాలుగు నెలలు అటు రైతులకు ఇటు వంశధార అధికారులకు సేవలు అందిస్తున్న తమకు వేతనాలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని వారు వాపోయారు.


