పోర్టు వాహనాల అడ్డగింత
టెక్కలి: టెక్కలి మండలం కె.కొత్తూరు గ్రామంలో ఆదివారం రాత్రి పోర్టు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కోటబొమ్మాళి నుంచి జాతీయ రహదారి మీదుగా కె.కొత్తూరు గ్రామాల మీదుగా మూలపేట పోర్టుకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. టెక్కలి శివారు ప్రాంతంలో ఉన్న పోర్టు రోడ్డు గుండా వాహనాలను తీసుకువెళ్లకుండా తమ గ్రామాల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో అంతా భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు నిలదీశారు. భారీ లోడులతో వెళ్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఇకపై తమ గ్రామం మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు.
సాఫ్ట్‌బాల్ రాష్ట్రపోటీల్లో సిక్కోలుకు తృతీయం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం బాలురు జట్టు తృతీయస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీహెచ్‌స్కూల్ వేదికగా ఈనెల 12 నుంచి 14 వ తేదీ వరకు రాష్ట్రపోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తృటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయిన శ్రీకాకుళం బాలురు జట్టు తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. జిల్లా జట్టు రాణింపుపై డీఈఓ ఎ.రవిబాబు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నాయకులు కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఎంవీ రమణ, ఎం.తిరుపతిరావు, ఆనంద్‌కిరణ్, ఢిల్లేశ్వరరావు, మల్లేష్, హరికృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వ్యవసాయ కళాశాలలో
ఇంటర్ కాలేజ్ మీట్ క్రీడలు
ఎచ్చెర్ల: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ మీట్ క్రీడలను ఎస్‌ఎస్‌ఆర్ పురం గ్రామలో ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో ఆదివారం కొనసాగించారు. జావెలిన్‌త్రో క్రీడలో ఎస్‌కేవైసీఎస్ వ్యవసాయ కళాశాల విద్యార్థి కిరణ్‌నాయక్ గోల్డ్ సాధించగా, వెండి పతకం బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి పి.నిఖిల్, రజత పతకం రా మానుజులు నాయక్‌లు సాధించారు. రిలే రన్నింగ్ 400/100 మీటర్లులో నైరా వ్యవసా య కళాశాలకు స్వర్ణం, ఎచ్చెర్ల వ్యవసా య కళాశాలకు వెండిపతకం, మహానంది వ్యవసా య కళాశాలకు రజతం లభించాయి. ట్రిపుల్ జంప్‌లో బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి బి.చంద్రశేఖర్ స్వర్ణపతకం సాధించగా ఎస్‌వీ సీ తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థి నిర్మ ల్ వెండి పతకాన్ని, ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థి వి.లక్ష్మణ్ రజత పతకాలను సాధించారు. 200 మీటర్లు రన్నింగ్ విభాగంలో ఎస్‌వీసీ తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థి అక్షయ్‌కుమార్ స్వర్ణం సాధించాడు. నైరా వ్యవ సాయ కళాశాల విద్యార్థి భానుప్రకాశ్ వెండి పతకాన్ని సాధించగా ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థి వైకుంఠలక్ష్మణ్ రజతం దక్కించుకున్నాడు. విజేతలకు ఎస్‌కేవై వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్.నారంనాయుడు అభినందనలు తెలిపారు.


