ఆదిత్యుని దర్శనం అద్భుతం
● రాజ్యసభ ఎంపీ సుధామూర్తి
అరసవల్లి: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని ఆదివారం దర్శించుకోవడం అద్భుతమ ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ సుధామూర్తి అన్నారు. ఆమె ఆదివారం అరసవల్లి సూర్యనారయణ స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ దంపతులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ గౌరవ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు చేయించారు. అంతరాలయం నుంచే ఆమె ప్రత్యేకంగా లక్ష ఒత్తులను వెలిగించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశ్వీచనాన్ని, తీర్థప్రసాదాలను శంకరశర్మ ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలుకు చేపడుతున్న చర్యల ను, దాతల సహాయాలను కోరుతున్నట్లుగా ఆల య ఈఓ ప్రసాద్ ఆమెకు వివరించారు. తాను అరసవల్లి ఆలయానికి రావడం ఇది రెండోసారి అని, ఆలయ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా చర్య లు చేపడతానన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు కుమార్తె బి.రమాదేవి, బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు తదితరులున్నారు. డీఎస్పీ వివేకానంద, వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేయించుకున్నారు. అనంత రం ఆమె శ్రీకూర్మంలోని కూర్మనాథుడిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలు చేశారు.
ఆదిత్యుని దర్శనం అద్భుతం


