కలములే గళములై..
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
ప్రభుత్వ స్థలంలో పాగాటెక్కలిలో అక్రమ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. –8లో
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రెండు నెలల పండగ చివరి అంకానికి చేరుకుంది. కలాల గళాల నుంచి సంతకాల రూపంలో పురుడు పోసుకున్న అభిప్రాయాలు, ప్రజాభీష్టానికి ప్రతిబింబమై నిలిచే పత్రాలు పాలకుల పునాదులు కదిలించేంత శక్తిని సముపార్జించాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మరో మాట లేకుడా తిరస్కరిస్తూ జిల్లా నుంచి 4.80 లక్షల మంది ఈ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
నేడు కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ
జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ విబాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల టౌన్‌హాల్‌కి ఉదయం 10 గంటలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో పెట్టి 10.30 గంటలకు ర్యాలీగా బయలుదేరనున్నారు. కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ మొదలుపెట్టిన యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ అపూర్వ స్పందనను దక్కించుకుంది. జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది ఈ పత్రాలపై సంతకాలు చేసి ప్రజా వ్యతిరేకతను స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో నాయకులు రెండు నెలల పాటు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్యను సులువుగా అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హ యాంలోనే దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు పూర్తిచేసి తరగతులు ప్రారంభించారు. మిగిలిన 12 కాలేజీలకు 7 భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5 కాలేజీలు 80 శాతం ప నులు పూర్తయితే వాటన్నింటిని చంద్రబాబు ప్రైవే టు వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు చూస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ రెండు నెలలు గా పోరాడుతోంది. పలు చోట్ల బీజేపీ, జనసేన నేతలు సైతం ఈ కార్యక్రమాన్ని మద్దతు పలికారు.
పేదలపై ఎందుకంత కక్ష..?
కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది తమ సంతకాలతో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి తోడు వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతి గ్రామంలోనూ సమావేశాలు పెట్టి ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలు వివరించారు. ఇప్పటికే నియోజకవర్గాల నుంచి ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి చేరవేశారు. ఆ ప్రతులను తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయానికి సోమవారం ఓ ప్రత్యేక వాహనంలో ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. అనంతరం ఈ నెల 18న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నా యకులు, పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్‌సీపీ అభిమానులంతా కలిసి గవర్నర్‌ను కలిసి తమ అభిప్రాయాలను తెలపనున్నారు.
చివరి అంకానికి కోటి సంతకాల సేకరణ
నేడు శ్రీకాకుళం నుంచి తాడేపల్లికి సంతకాల పత్రాల చేరవేత
18న గవర్నర్‌కు అందించేందుకు సన్నాహాలు
17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కల’మెత్తిన సిక్కోలు
జిల్లాలో 4.80 లక్షల సంతకాల సేకరణ
కలములే గళములై..
కలములే గళములై..


