breaking news
Lucknow airport
-
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా..
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో అధునాతన సదుపాయాలతో కూడి ఆశ్చర్యపరుస్తున్న ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో కనిపించే ఎయిర్ పోర్ట్ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని తెలుస్తోంది. ఇది కొత్తగా నిర్మించిన టెర్మినల్. ఇందులో అద్భుతమైన చిత్రాలు చూపరులను ముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది లక్నో విమానాశ్రయమా? సాంప్రదాయ ఆతిథ్యంలో నగరం ఖ్యాతిని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది. ఈ నగరాన్ని మళ్ళీ ఇప్పుడు సందర్శించాలనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: భారత్‌లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే.. That’s Lucknow airport?? Will take the city’s reputation for traditional hospitality to new heights… Bravo. Looking forward to visiting the city again now…pic.twitter.com/X64Ld3z3iG — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
విమానాశ్రయంలో మోదీ సోదరుడి ధర్నా
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో విమానాశ్రయంలో బుధవారం ధర్నాకు దిగారు. మద్దతుదారులను తానున్న స్థలం వద్దకు పోలీసులు అనుమతించలేదని, పోలీసులు వారిని అరెస్టు చేశారన్న ఆరోపణలతో ఆయన ఈ ధర్నా చేశారు. అయితే తామెవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయ అదనపు జనరల్ మేనేజర్ కథనం ప్రకారం.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విమానం దిగిన ప్రహ్లాద్ మద్దతుదారులను తన వద్దకు అనుమతించలేదని ధర్నా చేశారు. అంతేగాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన వారు పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు తాను ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ చర్య తీసుకోవాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారని అన్నారు. అయితే ఆయా వాదనలను సరోజిని నగర్ పోలీస్ ఎస్హెచ్ఓ మహేంద్ర సింగ్ ఖండించారు. తన పరిధితో ప్రహ్లాద్‌కు సంబంధించిన వారెవరూ అరెస్టయినట్లు తనకు తెలియదని అన్నారు. అయితే ప్రధాని సోదరుడైన ప్రహ్లాద్ పేరును ఫోర్జరీ చేసి జితేంద్ర తివారి అనే ఓ వ్యక్తి సుల్తాన్‌పూర్‌లో అరెస్టయ్యాడని నగర ఎస్హెచ్ఓ భూపేంద్ర సింగ్ చెప్పారు. చదవండి: అంతర్జాతీయ మద్దతు: అమిత్ షా ఆగ్రహం రైతు ఉద్యమంపై ట్వీట్ వార్ -
అఖిలేశ్‌కు చేదు అనుభవం
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు లక్నో విమానాశ్రయంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంగతి తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు విమానాశ్రయం బయట, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిరసనకు దిగారు. అఖిలేశ్ అలహాబాద్ వర్సిటీకి వెళ్తే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనే లక్నో విమానాశ్రయంలో ఆపినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చారు. అఖిలేశ్ అలహాబాద్ రాకుండా అడ్డుకోవాలని వర్సిటీ యాజమాన్యమే కోరిందని, ఆ మేరకే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. విమానాశ్రయంలో తనను అడ్డుకోవడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని అఖిలేశ్ ఆరోపించారు. యోగి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. మరోవైపు, అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ఘటనను ఖండించారు. తమ నాయకుడిని విమానాశ్రయంలో అడ్డుకున్నారన్న సంగతి తెలియగానే ఎస్పీ కార్యకర్తలు అలహాబాద్, ఝాన్సీ, కనౌజ్, బలరాంపూర్, జలాన్, అజాంగఢ్, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల అద్దాలు పగలగొట్టి, పోలీసులతో ఘర్షణలకు దిగారు. రాజ్యసభలోనూ: రఫేల్ ఒప్పందంపై విచారణకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయా లన్న డిమాండ్‌పై లోక్‌సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా అఖిలేశ్‌ను అలహాబాద్ వెళ్లకుండా యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై రాజ్యసభలో ఆందోళనలు మిన్నంటాయి. -
అఖిలేష్‌కు చేదు అనుభవం..!
-
అఖిలేష్‌కు చేదు అనుభవం..!
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం నిమిత్తం అలహాబాద్ వెళ్తున్న ఆయనను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అడ్డుకున్నారంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంపై నిర్బంధం విధించి హక్కులను కాలరాస్తోందని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కారణంలేకుండా అడ్డుకోవడంతో పోలీసులకు అఖిలేష్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అలహాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న తనను పోలీసులు బంధించారని అఖిలేష్ ట్విటర్లో పేర్కొన్నారు. విమానం వెళ్లిపోయిన తరువాత ఆయనను బయటకు పంపించారు. I was prevented from boarding the airplane without any written orders. Currently detained at Lucknow airport. It is clear how frightened the govt is by the oath ceremony of a student leader. The BJP knows that youth of our great country will not tolerate this injustice anymore! pic.twitter.com/xtnpNWtQRd — Akhilesh Yadav (@yadavakhilesh) February 12, 2019 -
న్యూస్ చానల్ ఎడిటర్ అరెస్ట్
లక్నో: మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా ప్రసారాలు చేస్తున్న ఓ న్యూస్ చానల్ సీఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సుదర్శన్ న్యూస్ అనే చానల్‌కు సురేష్ చావ్హంకే సీఎండీ, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను బుధవారం రాత్రి లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 8 మధ్య ఈ చానల్లో ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్పీ ఎంపీ ఒకరు బుధవారం రాజ్యసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తి, సదరు చానెల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. దీంతో పోలీసులు బుధవారం రాత్రే చానల్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. -
విమానాశ్రయాల ప్రైవేటీకరణ గడువు పెంపు
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభివృద్ధి చేసిన ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ మళ్లీ వాయిదా పడింది. చెన్నై, కోల్‌కత, లక్నో, గౌహతి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని వచ్చే నెల 17కు, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు వచ్చే నెల 12కు పొడిగించామని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిమిత్తం కంపెనీలను ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేయగలదని ఉన్నతాధికారొకరు వెల్లడించారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవడం, తాజాగా గడువు పొడిగింపు తదితర కారణాల వల్ల మొత్తం ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులంటున్నారు. కాగా వేల కోట్ల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.