అకస్మాత్తుగా టేకాఫ్‌ రద్దు, విమానంలో కేంద్రమంత్రి | Flight carrying Gadkari fails to take off due to glitch   | Sakshi
Sakshi News home page

అకస్మాత్తుగా టేకాఫ్‌ రద్దు, విమానంలో కేంద్రమంత్రి

Published Tue, Aug 13 2019 11:09 AM | Last Updated on Tue, Aug 13 2019 11:19 AM

Flight carrying Gadkari fails to take off due to glitch   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే  ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో  టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్‌  టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది.  ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్‌ విమానాశ్రయం సీనియర్‌  డైరెక్టర్‌  విజయ్‌ మూలేకర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement