
సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాక్షి మీడియా సపోర్టింగ్ స్పాన్సర్‌గా ఆదివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై నిర్వహించిన హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది.

5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆసక్తిగా పాల్గొన్నారు.


మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. విజేతలకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ పోటీల్లో మూడు వేలమందికి పైగా పాల్గొన్నారు.



సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాక్షి సెల్ఫీ పాయింట్‌లో ఫొటో దిగి సందడి చేశారు.




















