కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌బాబుగా బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్నాడు పరిటాల నిరుపమ్.
ప్రస్తుతం ఇతడు కార్తీక దీపం 2 సీరియల్‌లో నటిస్తున్నాడు.
తాజాగా అతడు తన భార్య మంజులతో కలిసి కొత్త ప్రయాణం ఆరంభించనున్నాడు.
బట్టల బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.
త్వరలోనే హైదరాబాద్‌లో ఓ క్లాత్ షోరూమ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
జూలై 30న ఈ స్టోర్ ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించాడు.


