వ్యక్తిని లాగేసుకున్న విమానం ఇంజిన్‌.. ఆ తర్వాత ఏమైందంటే? | Man Dies After Getting Sucked Into Plane Engine At Milan Airport | Sakshi
Sakshi News home page

వ్యక్తిని లాగేసుకున్న విమానం ఇంజిన్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

Jul 8 2025 9:26 PM | Updated on Jul 8 2025 9:29 PM

Man Dies After Getting Sucked Into Plane Engine At Milan Airport

స్పెయిన్‌: ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం(జూలై 8) ఎయిర్‌పోర్టులో విమానం ఇంజిన్‌ ఓ వ్యక్తిని లాగేసుకుంది. ఈ ఊహించని పరిణామంలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

వోలోటియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A319 విమానం స్పెయిన్‌కు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి విమానాశ్రయ టెర్మినల్‌లోకి రహస్యంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని అక్కడే వదిలేసి విమానాల పార్కింగ్ జోన్‌లోకి ప్రవేశించాడు.

అనంతరం,స్పెయిన్‌ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న వోలోటియా ఎయిర్‌బస్ A319 విమానం పక్కకు వచ్చాడు. ఈ ఊహించని ఘటనలో, ఆ వ్యక్తి విమానం ఇంజిన్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఎయిర్‌పోర్టులో  కార్యకలాపాలు నిలిచిపోయాయి. 19 విమానాల సర్వీసుల్ని రద్దు చేసిన అధికారులు.. మరికొన్నింటిని దారి మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement