గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడి | Israeli attack 12 Dead in Gaza | Sakshi
Sakshi News home page

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడి

Mar 16 2026 4:54 AM | Updated on Mar 16 2026 4:54 AM

Israeli attack 12 Dead in Gaza

ఇద్దరు చిన్నారులు సహా 12 మంది మృతి

కైరో: గాజాపై ఇజ్రాయెల్‌ ఆదివారం మరోసారి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భవతి, 8 మంది పోలీసులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

సెంట్రల్‌ గాజాలోని నుసెయిరత్‌ శరణార్థుల శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఒక బాలుడు, కవలలతో గర్భవతిగా ఉన్న అతడి తల్లి సహా నలుగురు చనిపోయారని అల్‌ అక్సా మార్టిర్స్‌ ఆస్పత్రి, ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 14 మంది గాయపడ్డారని వెల్లడించాయి. జవైదా సమీపంలో పోలీసు వాహనంపై జరిగిన మరో దాడిలో సీనియర్‌ పోలీసు అధికారి సహా 8 మంది చనిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement