అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మూడు దేశాల మధ్య దాడులు 17వ రోజుకు చేరుకున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకారంగా భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా దుబాయ్ ఎయిర్‌పోర్టు వద్ద ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో, ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అధికారులు నిలిపివేసినట్టు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల మేరకు.. దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఇంధన ట్యాంక్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ ఘటన జరిగినట్లు సమాచారం. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయ అధికారులు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The drone crash near Dubai International Airport resulted in damage to one of the fuel tanks, and Dubai Civil Defense teams are currently working to control the fire, with no injuries recorded so far.
Dubai Media Officepic.twitter.com/t5zmXfsWUD— Furkan Gözükara (@FurkanGozukara) March 16, 2026
కాగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రవాణా కేంద్రమైన దుబాయ్ విమానాశ్రయాన్ని ఇప్పటికే అనేకసార్లు ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల మార్చి 7న కూడా దాడి జరిగింది. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని ఇరాన్ పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వహించే ప్రధాన టెర్మినల్‌కు నిలయమైన ఖార్గ్ ద్వీపంపై ఇటీవల దాడులు చేయడానికి యూఏఈలోని ఓడరేవులు, రహస్య స్థావరాలను అమెరికా ఉపయోగించిందని ఇరాన్ ఆరోపించింది.
మరోవైపు.. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేపడతుండగా, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకారదాడులు కొనసాగిస్తోంది.
❗️🇮🇷⚔️🇦🇪 - A large fire broke out in the industrial zone adjacent to Dubai International Airport (DXB) following reports of an Iranian Shahed-136 drone—known in Russian service as the Geran-2—striking or being intercepted nearby.
Visible flames and smoke prompted authorities to… pic.twitter.com/0u1m4Zgtqo— 🔥🗞The Informant (@theinformant_x) March 16, 2026
Todo el aeropuerto de #Dubai en la planta baja .
No se han escuchado explosiones ni nada pero acaban de cerrar todos los pisos superiores incluidas las tiendas
No hay nadie arriba , solo un escuadrón de militares. pic.twitter.com/SJ0lc4FZWw— Don Hulio Mezquitas (@BuscaRaciocinio) March 15, 2026


