
అమెరికాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో శనివారం రాత్రి జనంపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో 11 మంది గాయపపడ్డారు. బాధితుల్లో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అందుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు వివరిస్తూ.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని తెలిపారు. ఈ ఘటన సినిమా సన్నివేశాన్ని తలపించిందన్నారు.

A knife-wielding man stabbed 11 in a Michigan Walmart. A brave armed civilian stepped in, likely saving lives.
Most Americans know: Evil can't be reasoned with—only stopped. pic.twitter.com/w70HNNZtM2— Manni (@ThadhaniManish_) July 27, 2025