
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ సారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్‌లైన్‌లో పలువురి హృదయాలను తాకింది.
వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్‌శ్రీ పోస్ట్ చేసింది.

చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. "అబ్బా, ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్" అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" అ " చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి పిల్లవాడికి అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.