
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్‌లో కనిపించాడు.