
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ 124వ మన్‌కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో మోదీ.. ఇటీవల కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని పేర్కొన్నారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్ సైన్స్‌పై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇన్‌స్పైర్ మనక్ అభియాన్ గురించి మాట్లాడారు. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో వస్తారని.. ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది చేరారన్నారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనలను నమో యాప్ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారన్నారు.
In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG
— ANI (@ANI) July 27, 2025
ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారన్నారు. ముంబైలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరుగునుందని చెప్పారు. ఇది అతిపెద్ద ఒలింపియాడ్ అవుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందన్నారు.