breaking news
National Space Day
-
మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్!
ఉనా (హిమాచల్): మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ.. హిమాచల్ ప్రదేశ్‌లో పిల్లలు చెప్పిన సమాధానం.. అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ.. మన దేశ విద్యా వ్యవస్థ దుస్థితి ఏంటో తెలియజెప్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ‘అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?’ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్త కంఠంతో ‘నీల్ ఆర్మ్‌్రస్టాంగ్’అని చెప్పారు. అందుకు ఎంపీ.. ‘కాదు.. నేను హనుమాన్ అనుకుంటున్నాను. వేల సంవత్సరాల నాటి మన సంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి ముఖ్యమైనవని ఇది చూపిస్తుంది. మనం మన స్వంతం గురించి నేర్చుకోకపోతే, బ్రిటిష్ వారు మనకు నేర్పించిన దానికే మనం పరిమితం అవుతాం’అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఆ రెండు సమాధానాలు తప్పు. ‘నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాదు.. యూరీ గగారిన్’అని చెప్పాల్సిన ఒక పార్లమెంటేరియన్.. జాతీయ అంతరిక్ష దినోత్సవం నాడు పిల్లల తప్పును సరిదిద్దకపోగా.. పురాణాలను చరిత్రగా చెప్పడం వివాదాస్పదమైంది. చర్రిత తప్పుదోవ.. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తరువాత 1969లో అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌్రస్టాంగ్ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకే ఠాకూర్ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ.. సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమంటే... సైన్స్, చరిత్ర పేరుతో పురాణాలను వల్లించడం కాదనే విషయాన్ని మరిచారు. మన చరిత్ర, సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ.. వాస్తవాలు, కల్పనల మధ్య తేడాను గుర్తించడం వారికి నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పు లేదు. కానీ.. పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే’అంటున్నారు. శాస్త్రీయ రుజువులు లేని పురాణాలు.. చరిత్ర వేరు.. పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్ వర్ణనలను పోలిన నగరం 19వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాత్ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. శాస్త్రీయ రుజువు లేకుండా, ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథనాలుగా మిగిలిపోతాయే తప్ప, చరిత్రగా కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు, యూరి గగారిన్ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి మరియు పార్లమెంటు సభ్యులు విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. -
అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి
న్యూఢిల్లీ: అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ‘జాతీయ అంతరిక్ష దినం’సందర్భంగా మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటినుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై అంతరిక్షం లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. స్పేస్ సెక్టార్లో ఒక విజయం తర్వాత మరో విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తంచేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దులు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ–క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అధునాతన సాంకేతికతను మనం సాధించామని తెలిపారు. -
2047 నాటికి స్పేస్ లీడర్ ఇండియా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. స్వదేశీ వ్యోమగాములను స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ రాకెట్లో అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2027లో ఈ మానవసహిత యాత్ర చేపట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందు గగన్‌యాన్ యాత్ర(జీ1)లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో మానవరహిత టెస్టు ఫ్లైట్‌ను ప్రయోగించబోతున్నారు. వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారు. మానవసహిత యాత్రకు అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరీక్షించడమే జీ1 యాత్ర ఉద్దేశం. మానవసహిత గగన్‌యాన్ యాత్రకు నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఎంపికయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో వారికి ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా నలుగురు వ్యోమగాములు శనివారం సమావేశమయ్యారు. తమ అనుభవాలు పంచుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి మన భూమిని దర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని శుభాంశు పేర్కొన్నారు. అది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మానవులకు భూమి ఎంతో విలువైన గ్రహం అని అర్థమైందని చెప్పారు. ఐఎస్ఎస్ యాత్ర తనకు అతిపెద్ద పాఠమని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గగన్‌యాన్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక స్వర్ణయుగమని, ఇందులో తాను భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఒక వ్యోమగామి దృష్టి ఎల్లప్పుడూ సరిహద్దులకు అతీతంగా ఉంటుందని గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అన్నారు. అంతరిక్ష రంగంలో పనిచేసేవారు ఇతర గ్రహాలపై ఆవాసాలు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలు మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయన్నారు. గగన్‌యాన్ మిషన్ అనేది ఎన్నో ఇతర మిషన్ల సమ్మేళనం అని వివరించారు. 2047 నాటికి ఇండియా ‘స్పేస్ లీడర్’గా ఎదగడానికి ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. మరో 20 ఏళ్లలో మనం అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలపై అంగద్ ప్రతాప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర దేశాల్లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకొని మన దేశం కోసం వారు పని చేస్తున్నారని కొనియాడారు. మానవ సహిత యాత్రల్లో ముందడుగు అంతరిక్ష కార్యకలాపాలు ఏవైనా సరే అవి మన భూమికి, మనుషులకు లబ్ధి చేకూర్చేలా ఉండాలని అజిత్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు. అలా లేకపోతే అవి వ్యర్థమేనని ఉద్ఘాటించారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మరెన్నో గొప్ప విజయాలు సాధించడానికి స్పేస్ సైంటిస్టులు, వ్యోమగాములు కలిసికట్టుగా పని చేయాలన్నారు. గత ఐదేళ్లలో ఎంతో సాధించామని, చంద్రుడిపైకి వెళ్లామని, డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేశామని గుర్తుచేశారు. స్పేస్ సెక్టార్లో ఎన్నో స్టార్టప్‌లు వస్తున్నాయని చెప్పారు. అంతరిక్షంలో మన పరుగులు చూసి ఇతర దేశాలు అసూయ చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. మన్ రోడ్‌మ్యాప్–2047 చాలా బలంగా ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదని బాలకృష్ణన్ నాయర్ పేర్కొన్నారు. -
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్‌యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం. 🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨ On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్‌యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్‌ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్‌కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్‌తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్‌ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్‌వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్‌లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్‌కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్‌క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్‌ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో 200కుపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆయన ఆదివారం 124వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అతిపెద్ద ఆధారం ‘వోకల్ ఫర్ లోకల్’ అని పునరుద్ఘాటించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో క్రీడలు, సైన్స్, సాంస్కృతికం తదితర రంగాల్లో ఎన్నో ఘనతలు నమోదయ్యాయని, అవి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు.శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రతో దేశమంతా పులకించిపోయిందని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చాక గర్వంతో ఉప్పొంగిపోయిందని, ప్రతి హృదయం సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. 2023 ఆగస్టులో చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైనప్పుడు భారతీయులు ఎంతగానో గర్వించారని గుర్తుచేశారు. చిన్నారుల్లో సైన్స్, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగిందని, చంద్రుడిపైకి చేరుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. స్పేస్ సైంటిస్ట్ కావాలన్న ఆలోచన వారిలో నాటు కుందని, ఇదొక శుభ పరిణామమని ఉద్ఘాటించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఒలింపియాడ్‌లో మన విద్యార్థుల ఘనత ‘‘చిన్నారుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉత్సాహం పెంచడానికి ఇన్‌సై్పర్–మానక్ అభియాన్ ప్రారంభించాం. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేశాం. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు. చంద్రయాన్–3 తర్వాత వారి సంఖ్య రెట్టింపయ్యింది. స్పేస్ స్టార్టప్‌లు ఐదేళ్ల క్రితం కేవలం 50 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటేసింది. 21వ శతాబ్దంలో నూతన శక్తితో సైన్స్ పురోగమిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో మన విద్యార్థులు దేవేశ్ పంకజ్, సందీప్ కుచీ, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి పతకాలు గెలుచుకున్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. విప్లవాల మాసం ఆగస్టు ఆగస్టు రాబోతోంది. ఆగస్టు అంటే విప్లవాల మాసం. 18 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదిరాం బోస్‌ను ఆగస్టులోనే బ్రిటిష్ పాలకులు ఉరి తీశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆగస్టు 1న మరణించారు. ఆగస్టు 8న గాంధీ నాయకత్వంలో క్విట్ఇండియా ఉద్యమం మొదలైంది. ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. దేశ విభజన కూడా ఇదే నెలలో జరిగింది. ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని ‘విభజన అకృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహించుకుంటున్నాం. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు వాడాలన్న పిలుపునకు అప్పటి ప్రజలు స్పందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నాం. In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025అదే మనందరి సంకల్పం మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఉత్పత్తులు విరివిగా ఉపయోగించాలి. మన దేశంలో తయారైన వస్తువులే విక్రయించాలి. అవే కొనుక్కోవాలి. అదే మనందరి సంకల్పం కావాలి. ఎందుకంటే వాటి తయారీ కోసం మనం స్వేదం చిందించాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు కొందరికి అసాధ్యంగా కనిపిస్తాయి. కానీ, మనమంతా ఒక్కటై పని చేస్తే అసాధ్యాలే సుసాధ్యాలవుతాయి. అందుకు తగిన ఉదాహరణ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. స్వచ్ఛతను ప్రజలు తమ బాధ్యతగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అవసరం ఇప్పటికీ ఉంది. 4,500 పట్టణాలు, నగరాలు ఇందులో భాగమయ్యాయి. 15 కోట్ల మందికిపైగా జనం పాలుపంచుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఒడిశాలో మాజీ నక్సలైట్ల విజయాలు స్ఫూర్తిదాయకం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మాజీ నక్సలైట్లు చేపల పెంపకంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. హింసను వీడి మత్స్య రంగంలో ప్రవేశించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభివృద్ధి దీపం వెలిగించవచ్చని నిరూపించారు. కొన్నిసార్లు దట్టమైన చీకటి నుంచే ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవిస్తుంది. గతంలో తుపాకులు పట్టుకొన్న నక్సలైట్లు ఇప్పుడు వలలు చేతబూని చేపల వేట సాగిస్తున్నారు. చక్కటి ఆదాయం పొందుతూ బతుకులు మార్చుకుంటున్నారు. ఈ విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. -
స్పేస్ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్23న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.ఈ ఏడాది థీమ్ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది Chandrayaan-3 Mission:Updates:The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom— ISRO (@isro) August 23, 2023 -
ఘనంగా ‘స్పేస్ డే’ వేడుకలు
సాక్షి,హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్ర పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విభాగం ఉద్యోగులు రెండ్రోజుల పాటు నేషనల్ స్పేస్డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్ధులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్ని పుస్కరిచుకొని తొమ్మిది పాఠశాలల విద్యార్ధులను ఆహ్వానించారు. వారికి మోడల్ మేకింగ్ పోటీ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలతో సహా అనేక రకాల పోటీలను నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రదర్శించిన వాహనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వాహనంలో స్పేస్‌కి సంబంధించిన కీలక అంశాలను ఇందులో ప్రదర్శించారు. ఎన్ఆర్ఎస్సి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను కోఆర్డినేట్ చేయగా.. విద్యార్థులు, ఎన్ఆర్సీఐ ఉద్యోగులు,యువ సైంటిస్ట్‌లు వీక్షించారు. ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్.విజయ్ విజేతలకు బహుమతులు అందించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు ప్రశంసా పత్రంగా ‘స్పేస్ ఎన్సైక్లోపీడియా’ పుస్తకాలను బహుమతిగా అందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పాపియా బిశ్వాస్,డాక్టర్ సంజయ్ ధాగే, మనీష్ తక్,డాక్టర్ నవీన్, ఎం.చవాన్, ఎన్.అపర్ణరావు,ఎం.ఇళయరాజా, ఎన్.అరుణ,ఎం.ఆర్.రెంజు,రీ డి.రమేష్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.