
నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్‌యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం.
🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨
On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025
2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్‌యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.
– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక