
రచయిత్రి,సామాజిక కార్యకర్త,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి ఆసక్తికరమైన విషయాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. రెండు పురాతన వస్తువుల గురించి షేర్ చేశారు. దీంతో ఆమెకు అభినందించడంతోపాటు,పనిలో పనిగా పుట్టిన రోజు శుభాకాంక్షఅందించారు అభిమానులు
సుధామూర్తి షేర్ చేసినవి పురాతన సింధులోయ నాగరికతలోని ప్రముఖ నగరమైన లోథల్ నుండి తవ్వబడిన ఐకానిక్ కళాఖండాలు.ఇందులో మొదటిది అద్భుతమైన బంగారు హారం. దీన్ని అతిసూక్ష్మమైన బీడ్స్ వేల సంవత్సరాల క్రితం రూపొందించారట.
y"> ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
రెండోది ఒక సాధారణ మట్టి కుండ. దాహం వేసిన కాకి రాళ్లు వేసి నీళ్లను పైకి తీసుకొచ్చిన కథలోని కూజాను పోలి ఉంది. లోథల్ నుండి వచ్చిన ఈ కళా ఖండాలు అద్భుతమైన హస్తకళ, కళాకారుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాతన వారసత్వం, నైపుణ్యం, మోడ్రన్ ఇండియా మేళివింపునకు సూచించే అద్భుతమైన క్షణాలు అని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధా మూర్తి రచయితగా, సామాజిక సమస్యలపై స్పందించడంతోపాటు దాతగా భారతీయులకు ఆమె సుపరిచితం. కర్ణాటకలోని షిగ్గావ్‌లో 1950 ఆగస్టు 19న జన్మించారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ అందించారు ఫ్యాన్స్.
ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్