
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జీవక్రియ సమస్యలతోపాటు,పీసీఓఎస్‌వల్ల బరువు పెరగడం, మొటిమలు, అవాంఛితరోమాలు, జుట్టు రాలడంలాంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు (బొడ్డు చుట్టూ) కొవ్వు పేరుకుపోవడం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది బరువుపెరగడమే కాదు, బరువు తగ్గడం కూడా కష్టమే. అందుకే దీన్ని "PCOS బెల్లీ" (క్లినికల్‌గా కాదు) అంటారు. PCOS ఉన్నవారిలో దాదాపు 20శాతం మంది ఈ లక్షణాలు కనిపిస్తాయి.
పీసీఓఎఎస్ బెల్లీ ఎందుకు వస్తుంది?
ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్ నిరోధకత PCOS ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన వాడకాన్ని పరిమితం చేయడమే కాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇదే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయేలా చేస్తుంది
ఇన్‌ఫ్లమేషన్ పీసీఓఎఎస్ మహిళలు దీర్ఘకాలిక మంటను అనుభవించే అవకాశం కూడా ఎక్కువే. ఇది కూడా ఇది బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.
హార్మోన్ల అసమతుల్యత: PCOSను తరచుగా హార్మోన్ల అసమతుల్యత.. ఆండ్రోజెన్‌ల (పురుష హార్మోన్లు) పెరిగిన స్థాయిలు కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీంతో బరువు తగ్గడం ఒక చాలెంజ్‌గా మారుస్తాయి.
ఒత్తిడి: ఇలాంటి మహిళల్లో ఒత్తిడి హార్మోన్‌గా పిలిచే కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. బెల్లీ ఫ్యాట్‌కు ఇదొక ప్రధాన కారణం.
బరువు తగ్గడం నిజంగా కష్టమా?
హార్మోన్ల అసమతుల్య , ఇన్సులిన్ నిరోధకత కలయిక బరువు పెరగడానికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బొడ్డుచుట్టూ కొవ్వును చాలా గట్టిగా మార్చేస్తుంది. అంతేకాదు PCOS నిర్వహణతో సంబంధం ఉన్న ఒత్తిడి, దాని లక్షణాల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. PCOS ఉన్న చాలా మంది మహిళలు చాలా ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా వ్యాయామం చేయలేరు.
PCOS బెల్లీ తగ్గడానికి చిట్కాలు
పీసీఓఎస్‌తో బాధపడేవారు నిజంగా బరువు తగ్గడం అసాధ్యమా అంటే కానే కాదు. కొంచెం చాలెంజింగే అయినప్పటికీ అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలు చూద్దాం.
ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
సమతుల్య ఆహారం: సంపూర్ణ ఆహారాలు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పీసీఓఎస్ దుష్ప్రభావాలలో ఒకటైన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్పైక్‌లను నివారించడానికి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోండి.
క్రమం తప్పని వ్యాయామం: బరువు తగ్గాలంటే వ్యాయామానిది చాలా కీలక పాత్రం. ముఖ్యంగా పీసీఓఎస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కార్డియో ,బల శిక్షణ వ్యాయామాల కలయికతో కూడిన రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం.
చదవండి: Wedding Anniversary: మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్
చక్కటి నిద్ర: హార్మోన్ నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి ప్రతి రాత్రి 7-9 గంటల నిరంతరాయ నిద్ర కావాలి.
ఒత్తిడిని ఎదుర్కోవడం : ఒత్తిడి లేని జీవనశైలిని ఎంచుకోవాలి.
మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం లేదా ప్రాణాయామ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేని జీవితం సగం సమసల్ని నివారిస్తుంది.
అవసరమైన సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో, ఇనోసిటాల్ లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి సప్లిమెంట్లు హార్మోన్ సమతుల్యతకు మద్దతు ఇవ్వడంలో ,జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?
PCOS అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఈ అవయవాలు ఉన్నవారిలో సాధారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. PCOS ఉన్నవారిలో తరచుగా సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజెన్ స్థాయిలు ఉంటాయి. PCOS ఉన్నవారిలో కనీసం 50శాతం మందికి మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.ఉదర బరువు పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, సరియైన వ్యాయామం, చికిత్స తీసుకోవడం ఉత్తమం.