breaking news
Insulin resistensi
-
పీసీఓఎస్ బెల్లీ తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జీవక్రియ సమస్యలతోపాటు,పీసీఓఎస్వల్ల బరువు పెరగడం, మొటిమలు, అవాంఛితరోమాలు, జుట్టు రాలడంలాంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు (బొడ్డు చుట్టూ) కొవ్వు పేరుకుపోవడం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది బరువుపెరగడమే కాదు, బరువు తగ్గడం కూడా కష్టమే. అందుకే దీన్ని "PCOS బెల్లీ" (క్లినికల్‌గా కాదు) అంటారు. PCOS ఉన్నవారిలో దాదాపు 20శాతం మంది ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎఎస్ బెల్లీ ఎందుకు వస్తుంది?ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్ నిరోధకత PCOS ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన వాడకాన్ని పరిమితం చేయడమే కాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇదే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయేలా చేస్తుందిఇన్ఫ్లమేషన్ పీసీఓఎఎస్ మహిళలు దీర్ఘకాలిక మంటను అనుభవించే అవకాశం కూడా ఎక్కువే. ఇది కూడా ఇది బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.హార్మోన్ల అసమతుల్యత: PCOSను తరచుగా హార్మోన్ల అసమతుల్యత.. ఆండ్రోజెన్ల (పురుష హార్మోన్లు) పెరిగిన స్థాయిలు కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీంతో బరువు తగ్గడం ఒక చాలెంజ్‌గా మారుస్తాయి.ఒత్తిడి: ఇలాంటి మహిళల్లో ఒత్తిడి హార్మోన్‌గా పిలిచే కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. బెల్లీ ఫ్యాట్‌కు ఇదొక ప్రధాన కారణం.బరువు తగ్గడం నిజంగా కష్టమా?హార్మోన్ల అసమతుల్య , ఇన్సులిన్ నిరోధకత కలయిక బరువు పెరగడానికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బొడ్డుచుట్టూ కొవ్వును చాలా గట్టిగా మార్చేస్తుంది. అంతేకాదు PCOS నిర్వహణతో సంబంధం ఉన్న ఒత్తిడి, దాని లక్షణాల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. PCOS ఉన్న చాలా మంది మహిళలు చాలా ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా వ్యాయామం చేయలేరు.PCOS బెల్లీ తగ్గడానికి చిట్కాలుపీసీఓఎస్తో బాధపడేవారు నిజంగా బరువు తగ్గడం అసాధ్యమా అంటే కానే కాదు. కొంచెం చాలెంజింగే అయినప్పటికీ అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలు చూద్దాం.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు సమతుల్య ఆహారం: సంపూర్ణ ఆహారాలు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పీసీఓఎస్ దుష్ప్రభావాలలో ఒకటైన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్పైక్‌లను నివారించడానికి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోండి. క్రమం తప్పని వ్యాయామం: బరువు తగ్గాలంటే వ్యాయామానిది చాలా కీలక పాత్రం. ముఖ్యంగా పీసీఓఎస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కార్డియో ,బల శిక్షణ వ్యాయామాల కలయికతో కూడిన రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం.చదవండి: Wedding Anniversary: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్చక్కటి నిద్ర: హార్మోన్ నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి ప్రతి రాత్రి 7-9 గంటల నిరంతరాయ నిద్ర కావాలి.ఒత్తిడిని ఎదుర్కోవడం : ఒత్తిడి లేని జీవనశైలిని ఎంచుకోవాలి. మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం లేదా ప్రాణాయామ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేని జీవితం సగం సమసల్ని నివారిస్తుంది. అవసరమైన సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో, ఇనోసిటాల్ లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి సప్లిమెంట్లు హార్మోన్ సమతుల్యతకు మద్దతు ఇవ్వడంలో ,జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?PCOS అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఈ అవయవాలు ఉన్నవారిలో సాధారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. PCOS ఉన్నవారిలో తరచుగా సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజెన్ స్థాయిలు ఉంటాయి. PCOS ఉన్నవారిలో కనీసం 50శాతం మందికి మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.ఉదర బరువు పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, సరియైన వ్యాయామం, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
డయాబెటిస్ ఇప్పుడు జీవిత మాధుర్యాన్ని కోల్పోనక్కరలేదు
గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్ అనే మాట మనం తరచుగా వింటున్నాం. అంతకుముందు డయాబెటిస్ లేదా... అంటే ఉండేది. కాని చాలా తక్కువ మందిలో ఈ వ్యాధి కనిపించేది. గత 30 ఏళ్లలో మానవ జీవన విధానంలో అనేక మార్పులు రావడం... ముఖ్యంగా మన శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరగడం అనేది అతి ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. మానవ శరీరంలో ఉపయోగపడకుండా మిగిలిపోయిన చక్కెర పదార్థాలు సాధారణ స్థితి కంటే ఎక్కువ మోతాదులో రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటారు. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. డయాబెటిస్ రకాలు టైప్ 1: ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. దీనినే జువైనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. టైప్ 2: నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ టైప్ 3: జెస్టేషనల్ డయాబెటిస్. ఇది గర్భిణులలో కనిపిస్తుంది. మొదటి రకం డయాబెటిస్ చిన్నవయస్సులో వచ్చే డయాబెటిస్. దీనిలో ఎక్కువశాతం మంది 20 స॥పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనినే ‘జువైనల్’ డయాబెటిస్ అంటారు. ఇది శరీరంలోనే క్లోమగ్రంథిలో బేటా సెల్ నుండి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడం వలన వస్తుంది. రెండవ రకం డయాబెటిస్. ఎక్కువగా 30 సంవత్సరాలు దాటినవారిలో వస్తుంది. దీనికి రెండు కారణాలు. 1. అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం. 2. శరీరంలోని కణజాలం ఇన్సులిన్ని ఉపయోగించుకోలేకపోవడం ఇది శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక ఒత్తిడి అధికం గల వారిలోనూ, ఎక్కువగా రాత్రివేళలో ఉద్యోగాలు చేసే వారైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కాల్ సెంటర్లో మార్కెటింగ్ పని చేసేవారిలో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి కలిగి ఉన్న వారి సంతానానికి స్థూలకాయం ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ కారణాలు శారీరక శ్రమ తక్కువగా ఉండి మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం. ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం. దీనినే ‘ఇన్సులిన్ రెసిస్టెన్సీ’ అంటారు. వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఉన్నట్లయితే సంతానానికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన కూడా టైప్-1 డయాబెటిస్వస్తుంది. క్లోమగ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్ వలన వస్తుంది. క్రానిక్ పాంక్రియాటైటిస్ వలన వస్తుంది. పార్షియల్ పాంక్రియాడక్టమి వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఇడియోపతిక్’ డయాబెటిస్ అని కూడా అంటారు. కాంప్లికేషన్స్ షుగర్ ఉన్న వారు సరైన చికిత్స, జీవన విధానం లోపించడం వలన ఇది ఇతర వ్యాధులకు మూల కారణంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేషన్లలో కొన్ని. డయాబెటిస్ పుట్ డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి అధిక రక్తపోటు, శరీరంలో కొలస్ట్రాల్ లెవల్స్ పెరగడం ఛాతీనొప్పి, గుండెపోటు పక్షవాతం కాటరాక్ట్ గాస్ట్రిక్ సమస్యలు రోగ నిర్థారణ పరీక్షలు =పాస్టింగ్ బ్లెడ్ షుగర్ (FBS) =పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ (PPBS) =HBA1C =గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ (GTT) =యూరిన్ షుగల్ లెవల్స్ =రాండమ్ షుగర్ లెవల్స్ (RBS) వీటితో పాటుగా బ్లడ్ యూరియా లెవల్స్, సీరమ్ క్రియాటినిన్ లెవల్స్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ మొదలగు పరీక్షలు చేయించడం వలన కచ్చితమైన చికిత్స ఇవ్వడం వీలవుతుంది. దీర్ఘకాలంలో షుగర్వ్యాధి బారిన పడ్డవారిలో శరీరంలోని అనేక రకాల అవయవాలు జబ్బుపడి, ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీస్తుంది. అందువల్ల వీలైనంత వరకు ప్రారంభదశలోనే వైద్యులను కలవడం మంచిది. రోగ లక్షణాలు అధిక దాహం అధిక ఆకలి అధిక మూత్రస్రావం బరువు తగ్గడం త్వరగా నీరసం రావడం, పిక్కల్లో నొప్పి రావడం ఒళ్లు నొప్పులు రావడం గాయాలు నయం కాకపోవడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులు ఎక్కువగా రావడం. శిశ్నం మీద చర్మం పగిలిపోవడం సెక్స్ కోరికలు తగ్గిపోవడం కాళ్లూ చేతులలో తిమ్మిర్లు రావడం. హోమియోకేర్ ఇంటర్ నేషనల్ జెనెటిక్ కాంస్టిట్యూషన్ విధానం ద్వారా వ్యక్తిలోని డయాబెటిస్ జబ్బుని కాదు, డయాబెటిస్తో ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం ద్వారా ఎలాంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. డయాబెటిస్ గుర్తించిన వెంటనే హోమియోపతి వైద్యంతో సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులో అధిక ఒత్తిడి వలన వచ్చే స్ట్రెస్ డయాబెటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.