
మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్‌కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. భర్త రోజా ఆర్‌కే సెల్వమణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు.
రోజా ఇన్‌స్టా పోస్ట్
❝మణి ఎదలో…
రోజా పూదోట…
అదే నింగి, అదే నేల…
అదే దివి, అదే భువి…
అదే నీరు, అదే గాలి…
నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...
పంచభూతాల సాక్షిగా,
మనువాడిన మణి నీ
ఎదమది తోటలో ప్రతీ రోజూ
వికసించే రోజానై
నీ వెంట…
నీ జంటగా
నిలిచాను...!!
మన 34 ఏళ్ళ ప్రయాణం
నా జీవితానికి అందమైన కానుక...
ప్రతీ క్షణం తోడుగా, బలంగా,
ప్రేమగా నన్ను నిలిపిన
మీకెప్పటికీ రుణపడి
ఉంటాను..❜

దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.
ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత