
టాలీవుడ్ హీరోయిన్ సమంత మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. పాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్ గ్రాజియా కవర్ పేజీపై సమంత తళుక్కున మెరిసారి . వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసినట్టు గ్రాజియా ప్రకటించింది. ఈ సందర్భంగా 15 ఏళ్ల నట ప్రయాణంలో ఎన్నో విలువైన పాత్రలు పోషించారని ప్రశంసిస్తూ సమంతపై ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.
పదిహేను సంవత్సరాలు, లెక్కలేనన్ని పాత్రలు, ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం. యాక్టింగ్ నుంచి సినిమాలను నిర్మించడం,తన సొంత వ్యాపారాల స్థాపన వరకు, మొదటి చిత్రాన్ని నిర్మించడం, వెల్నెస్ వెంచర్లను ప్రారంభించడంతోపాటు ఆధునిక మహిళను ప్రతిబింబించే పాత్రలను ఎంచుకోవడం ద్వారా సమంత రూత్ ప్రభు తన సొంత మార్గాన్ని నిర్దేశించుకుంటోందని తెలిపింది. యూరోసెంట్రిక్ ఆదర్శాలను దాటి ఫ్యాషన్ ఇమేజరీని పునర్నిర్మిస్తున్న ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్‌లతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గ్రాజియా వెల్లడించింది. మ్యాగజైన్‌లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు 'గ్రాజియా' పేర్కొంది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, ఝుంకాలు, నెక్లెస్‌తో అద్బుతంగా కనిపిస్తున్న సమంత లుక్‌కు ఫిదా అవుతున్నారు
తాను ఒకేసారి ఐదు సినిమాలు తీయనని, తన బాడీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పనిని తగ్గించానని గ్రాజియతో తెలిపింది. అయితే చేసే ప్రతీ పనిలో పూర్తి శక్తిని పెడుతున్నాననీ,పరిమాణం తగ్గి ఉండవచ్చు కానీ ప్రాజెక్టుల నాణ్యత ఖచ్చితంగా పెరిగిందని స్పష్టం చేసింది. జీవితంలో ప్రతిదీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైనే ఉంటుంది. నిద్ర, ఆహారం,మానసిక ఆరోగ్యం గురించి గతంలో కంటే కఠినంగా ఉంటున్నానని చెప్పింది. అలాగే చాలెంజింగ్ పాత్రలు, ముఖ్యంగా మహిళల కోసం ముఖ్యమైన చిత్రాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఆధునిక స్త్రీని సూచించే పాత్రలను పోషించాలనుకుంటున్నా అవి రావడ కష్టంమే కానీ అదే లక్ష్యం అని పేర్కొంది. కాగా సమంత నిర్మాతగా వచ్చిన తొలి సినిమా శుభం'. మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాలోఅతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా