బ్యాక్‌ టు సెట్‌ | Samantha Ruth Prabhu is back on the sets just four days after getting married to Raj Nidimoru | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు సెట్‌

Dec 7 2025 4:03 AM | Updated on Dec 7 2025 4:03 AM

Samantha Ruth Prabhu is back on the sets just four days after getting married to Raj Nidimoru

వివాహం తర్వాత తిరిగి షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్‌ సమంత. దర్శక–నిర్మాత రాజ్‌ నిడుమోరు, సమంత ఈ డిసెంబరు 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఐదు రోజుల్లోనే సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో తిరిగిపాల్గొన్నారు.

సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ పీరియాడికల్‌ ఫ్యామిలీ, యాక్షన్‌ మూవీకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓ...బేబీ’ వంటి సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత సమంతతో కలిసి నందినీ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరు నిర్మిస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement