World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్‌సైజ్, వాకింగ్, యోగా లాంటి చేయడం వలన షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం జిమ్ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్‌లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
నడక, స్ట్రెచింగ్, స్క్వాట్‌లు లేదా వాల్ పుష్-అప్‌లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్‌ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి.
వ్యాయామం చేసినప్పుడు, కండరాల్లోని మైటోకాండ్రియా పవర్‌హౌస్‌లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్‌ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే అదనపు కొవ్వును కరిగిస్తుంది.
రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్‌ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
తేలికపాటి వ్యాయామాలు
చురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.
వాల్ పుష్-అప్‌లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.
స్క్వాట్‌లు అండ్ లంగెస్ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.
లైట్ స్ట్రెచింగ్ అండ్ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.
రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా చేస్తుందీ వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
సోలియస్ పుష్-అప్‌లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి కిందికి కదలించేలా చేసే వ్యాయామం.
క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్‌ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్‌ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్‌స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి!


