జలాంతర్గామిలో ద్రౌపదీ ముర్ము ప్రయాణం | President Murmu Undertakes Submarine Sortie At Karwar Naval Base | Sakshi
Sakshi News home page

జలాంతర్గామిలో ద్రౌపదీ ముర్ము ప్రయాణం

Dec 28 2025 3:12 PM | Updated on Dec 28 2025 3:53 PM

President Murmu Undertakes Submarine Sortie At Karwar Naval Base

కార్వార్‌: భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము ఇవాళ (డిసెంబర్‌ 28, ఆదివారం) జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్‌ నౌకాదళ స్థావరం నుంచి స్వదేశీ కల్వరి క్లాస్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లో ఆమె ప్రయాణించారు.

సాయుధ దళాల సుప్రీం కమాండర్ ముర్ము వెంట నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఉన్నారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్‌ చేసింది. కల్వరి క్లాస్‌ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కల్వరి శ్రేణి సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు.

కాగా, రెండు వేర్వేరు రకాల యుద్ధ విమానాల్లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ ఏడాది అక్టోబర్‌ 29న హరియాణాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ద్రౌపదీ ముర్ము అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధవిమానంలో ప్రయాణించారు. 2023లో ఆమె సుఖోయ్‌–30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రయాణించిన యుద్ధ విమానం సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. రాష్ట్రపతి రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లో దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తిరిగి అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement