
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.
చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి
2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.
ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లు
మొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్‌తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత