
కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం. బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా సాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి-17 సిరీస్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య కుమార్ నిలిచారు. అలవోకగా వరుస ప్రశ్నలకు సమాధానమిస్తూ రూ. 7 కోట్ల విలువైన ప్రైజ్ మనీ సాధించే చివరి రౌండ్‌కు చేరుకున్నాడు.
చివరి రౌండ్ వరకూ ఎలాంటి లైఫ్‌లైన్‌లను వాడకుండా ఆటను కొనసాగించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా కోటి ప్రశ్నకు సరైన సమాధానం సీజన్‌కి తొలి కోటీశ్వరుడిగా ఆదిత్య నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆదిత్య మేధస్సు, పట్టుదలపై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. అయితే రూ. 7 కోట్ల ప్రశ్నగా చివరి ప్రశ్న "1930లలో భారతదేశాన్ని సందర్శించిన జపనీస్ కళాకారుడు ఎవరు?తాజ్ మహల్, సాంచి స్థూపం , ఎల్లోరా గుహల నమూనాలను ప్రసిద్ధ సిరీస్‌ను చిత్రించాడు?" అనే ప్రశ్న.
ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత
సరైన సమాధానం తెలియక, అప్పటికే గెలుచుకున్న ప్రైజ్‌మనీతో షో నుండి నిష్క్రమించేందుకు నిర్ణయించు కున్నాడు కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? అయితే రూల/ ప్రకారం నిష్క్రమించే ముందు అతను సమాధానాన్ని గెస్ చేయాల్సి ఉంటుంది. అలా అతను హిరోషి నకాజిమాను సమాధానంగా ఊహించాడు. అదృష్టవశాత్తూ అతన షోనుంచి వైదొలిగేందుకు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే కానీ ఆదిత్య గెస్ చేసిన సమాధానం తప్పు. సరైన సమాధానం ప్రసిద్ధ జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా. దీంతో ఆదిత్య రూ. 1 కోటి , కారుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆదిత్య షోనుంచి నిష్ర్కమించాడు.మరోవైపు తన విజయంపై ఆదిత్య సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి తన టార్గెట్ కోటి రూపాయలు గెల్చుకోవడం కాదని కోటి ఒక రూ.7 కోట్లు. అయితే కేవలం డబ్బు కోసమే ఈ షోలో పాల్గొనలేదని, సంసిద్ధత, ప్రశాంతత, నమ్మకం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయని నిరూపించాలనుకున్నానని చెప్పాడు. ఈ ప్రయాణమే అసలైన విజయమని వ్యాఖ్యానించాడు.
చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు
ఎవరీ హిరోషి యోషిడా.
జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా ల్యాండ్‌స్కేప్ ఆర్ట్‌కు ప్రసిద్ధి చెందారు. 20వ శతాబ్దానికి చెందిన ఆర్టిస్ట్, వుడ్‌బ్లాక్ ప్రింట్‌మేకర్ షిన్-హాంగా కళా ఉద్యమంలో ప్రముఖంగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖచిత్రాలను గీశారు. అలాంటి వాటిల్లో ప్రదానమైనవి తాజ్ మహల్, స్విస్ ఆల్ప్స్ అండ్ గ్రాండ్ కాన్యన్ ఉన్నాయి. ఇవి సాంప్రదాయ జపనీస్ శైలిలో రూపొందించారు. నిర్మలమైన, వివరణాత్మక సౌందర్య మరియు క్రాస్-కల్చరల్ కళాత్మక వ్యక్తీకరణలు ఆదరణ పొందాయి.ప్రకృతితో లోతుగా అనుసంధానించబడిన కళాకారుడిగా పేరు గాంచారు.
44 ఏళ్ల వయస్సులో, హిరోషి యోషిడా డ్రాయింగ్‌లను వుడ్‌బ్లాక్ ప్రింట్‌లుగా ప్రచురించడం ప్రారంభించాడు. 49 సంవత్సరాల వయస్సులో తన మొదటి సేకరణను విడుదల చేశాడు. యూరోపియన్ వాస్తవికతను సాంప్రదాయ జపనీస్ వుడ్‌బ్లాక్ పద్ధతులతో మేళవించి విలక్షణమైన కళాత్మక శైలిని సృష్టించిందని జపనీస్ MOA మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఆయనను ప్రశంసించింది.

1876లో ఫుకుయోకాలోని కురుమే నగరంలో జన్మించిన ఆయన 1887లో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఫుకుయోకా నగరానికి వెళ్లారు. చిన్నతనంలో ఆయనకు కళ పట్ల అతని అభిరుచిని చూసిన తర్వాత, లేడీ ఆర్ట్ టీచర్ యోషిడా కసాబురో ఆయనను దత్తత తీసుకున్నారు. తరువాత ఆయన క్యోటో మరియు టోక్యోలలో పాశ్చాత్య శైలి చిత్రలేఖనాన్ని అభ్యసించారు. 23 సంవత్సరాల వయస్సులో, ఆయన ఉత్తర అమెరికాకు వెళ్లి డెట్రాయిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ , ఇతర గ్యాలరీలలో కళాకృతులను అమ్మడం ద్వారా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన యూరప్ అంతటా పర్యటించి రెండు సంవత్సరాల తర్వాత జపాన్‌కు తిరిగి వచ్చారు.
యోషిడా కళా ప్రచురణకర్త వటనాబే షోజాబురోను కలిసి 'ది సేక్రెడ్ గార్డెన్ ఇన్ మీజీ ష్రైన్' పేరుతో తన మొదటి వుడ్‌బ్లాక్ ముద్రణను ప్రచురించారు. 1923లో, గ్రేట్ కాంటో భూకంపం తర్వాత ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్లారు.