
దేశీయ వరి రకాలు 23 జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ( GI) గుర్తింపును సాధించింది. మన దేశంలో వరి పంట ప్రధానమైన పంట. వరి రకాన్ని సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అలాంటి రైస్ లో కేరళ ప్రాంతంలో రైస్ ఒకటి నవరా రైస్. అందుకే దీన్ని కేరళ బియ్యం లేదా ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని నమ్ముతారు. అలాగే గంధసాలే పొడవైన ధాన్యం రకం. ఇది కర్ణాటక, పంజాబ్ & హర్యానా (మోగ్రా, బాస్మతి)లలో ఎక్కువగా పండిస్తారు. వివిధ రకాల వరి, వాటి ప్రయోజనాలను చూద్దాం.
దేశీ వరి రకాల్లో ఔషధ గుణాలు!
మైసూరులో సేవ్ అవర్ రైస్, సహజ సమృద్ధ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన దేశీ వరి మేళాలో ఔషధ విలువలున్న చాలా రకాల బియ్యం రకాలను ప్రదర్శించారు. బియ్యాన్ని, విత్తనాలను కూడా విక్రయించారు. వారు చెప్పిన ఔషధ గుణాలు ఇవి...
దయానా : తీవ్రమైన మధుమేహం ఉన్న వారికి ఉపయోగకరం.
నవర : ‘ఇండియన్ వయాగ్రా’. నపుంసకత్వాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
మాపిళ్లై సాంబా : శక్తిని పెంచే గుణం కలిగినది. కొత్త అల్లుళ్లకు తినిపించే ప్రత్యేక రకం బియ్యం.
గంధసాలే : బిర్యానీ, పులావు కోసం సువాసనగల బియ్యం.
సిద్ధసన్న : రోజువారీగా అన్నం వండుకొని తినటానికి అనుకూలం.
దొడ్డా బైరా నెల్లు : పెరుగన్నానికి బాగుంటాయి. కజ్జాయ (తీపి వడలు), దోసెలు, ఇడ్లీకు అనువైనవి
రాజముడి : రోజువారీ భోజనం కోసం బాగుంటాయి.
దొడ్డిగా : బియ్యపు పిండితో రొట్టె, పెరుగు అన్నం చేసుకోవటానికి ఉత్తమమైనది.
బర్మా బ్లాక్ : పాయసానికి అనువైనది
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్.
చదవండి: మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా