ఈ నూతన సంవత్సరంలో సోడాను తగ్గించి ఆరోగ్యకరమైన మార్గంలో వెళ్లాలనుకుంటే మీరు టెపాచే (tepache) తయారు చేసుకోవాలి. ఇది తేలికగా పులియబెట్టిన మెక్సికన్ పానీయం, ఇది పైనాపిల్ తొక్కలు, నీటిని ఉపయోగించి తయారు చేసిన బంగారు రంగు పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా శరీరానికి అద్భుతమైన రిఫ్రెషింగ్ కూడా!
టెపాచే అనే ఈ సంప్రదాయిక పానీయాన్ని మెక్సికోలో వీధి వ్యాపారులు మట్టి ముంతలలో విక్రయిస్తారు. ఈ పానీయాన్ని పైనాపిల్ తొక్కలు, కొద్దిపాటి గుజ్జు, పైనాపిల్‌లోమనం తినలేక వదిలేసే గట్టి కండలాంటి వ్యర్థాలకు బ్రౌన్‌సుగర్‌ను, కొద్ది సుగంధ ద్రవ్యాలను కలిపి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇది పూర్తి ప్రొబయోటిక్. అంతేకాదు, ఏ వాతావరణానికైనా అనువైన స్వదేశీ పానీయంగా చెప్పుకోవచ్చు.
ఇదీ చదవండి: జంక్ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!


